Ashok Galla:‘హీరో’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

Surya Prakash   | Asianet News
Published : Jan 21, 2022, 07:41 AM IST
Ashok Galla:‘హీరో’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌ సందడి చేసారు.  జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. అమరరాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై  ఈ చిత్రాన్ని నిర్మించారు.


ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు ..తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ హీరోగా వెండితెరకు పరిచయం అయిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైంది.  మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం చెప్పుకోదగిన రీతిలో లేవు. ఈ సినిమాకు గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు, నరేష్, బ్రహ్మాజీ, రోల్ రీడా కీలకపాత్రలలో నటించారు.   కోవిడ్ నేపధ్యంలో ఈ సినిమా వర్కవుట్ కాలేదని చెప్తున్నారు. దాంతో చాలా మంది ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు  ఈ చిత్రం ఓటీటి ప్లాట్ ఫామ్ కూడా ఫిక్సైంది.అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. అయితే రిలీజైన నెల తర్వాత అంటే పిబ్రవరి 13 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.  యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌ సందడి చేసారు.  జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. అమరరాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై  ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
చిత్రం కథేమిటంటే...హీరో కావాలనుకునే కుర్రాడు అర్జున్‌ (అశోక్‌ గల్లా). అతని నైబర్‌ కమ్‌ గర్ల్ ఫ్రెండ్‌ సుబ్బు (నిధి అగర్వాల్‌). అర్జున్‌ తండ్రి వెటర్నరీ డాక్టర్‌ (నరేష్‌). అతని దగ్గర పనిచేస్తుంటుంది సుబ్బు. అనుకోకుండా ఓ సందర్భంలో సుబ్బు తండ్రిని కలుస్తాడు అర్జున్‌. వాళ్లిద్దరికీ ఫస్ట్ మీటింగ్‌ నుంచే పడదు. అయినా అతన్ని ఓ ఆపద నుంచి కాపాడుతుంటాడు అర్జున్‌. అర్జున్‌ పేరుతో ఉన్న ఆ ఇంకో వ్యక్తి ఎవరు? అతనికి సుబ్బు ఫాదర్‌కి ఉన్న గొడవలేంటి? సుబ్బు తండ్రి ఫ్లాష్‌బ్యాక్‌లో ఎలకు? అర్జున్‌ సమస్యలు తెలుసుకుని అతని తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు? మధ్యలో ముంబై భాయ్‌ ఎవరు? వంటివన్నీ సెకండ్‌ హాఫ్‌లో తెలిసే విషయాలు.

 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు