వెంకటేష్, రాధిక ఇళ్లపై ఐటీ దాడులు!

Published : Jan 03, 2019, 11:16 AM IST
వెంకటేష్, రాధిక ఇళ్లపై ఐటీ దాడులు!

సారాంశం

కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై అధికారులు ఐటీ దాడులు నిర్వహించారు.60 చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు జరిపారు. సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, సీఎం సతీమణి సినీ నటి రాధిక ఇళ్లలో సోదాలు చేశారు. 

కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై అధికారులు ఐటీ దాడులు నిర్వహించారు.60 చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు జరిపారు. సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, సీఎం సతీమణి సినీ నటి రాధిక ఇళ్లలో సోదాలు చేశారు. 

వారి నుండి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  ఉదయం ఆరు గంటల నుండి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని సమాచారం. ఆరు నెలల క్రితం ఇలానే ఐటీ దాడులు నిర్వహించగా.. ప్రముఖ టీవీ ఆర్టిస్టులు, దర్శకులు అక్రమ సంపాదనతో అధికారులకు దొరికారు. 

మరోసారి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికాసేపట్లో హీరో యష్, కిచ్చా సుదీప్, సుష్మితా ఇంటిపై ఐటీ దాడులు జరగనున్నాయని సమాచారం. నిర్మాతలతో పాటు దర్శకులపై కూడా ప్రత్యేక సోదాలు జరపనున్నారు. ఇప్పటివరకు జరిపిన ఐటీ దాడుల్లో అధికారులకు ఇల్లీగల్ గా కొన్ని ప్రాపర్టీస్ దొరికాయని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

డేటింగ్ యాప్ లో మొదటి అనుభవం, అతడితో 8 గంటలు గడిపా.. నటి బోల్డ్ కామెంట్స్ వైరల్
'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?