రౌడీషీటర్‌ హత్య కేసులో నటి ప్రియాంక అరెస్ట్!

Published : Apr 29, 2019, 11:13 AM ISTUpdated : Apr 29, 2019, 11:14 AM IST
రౌడీషీటర్‌ హత్య కేసులో నటి ప్రియాంక అరెస్ట్!

సారాంశం

కన్నడ నటి ప్రియాంకను ఆదివారం నాడు చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కన్నడ నటి ప్రియాంకను ఆదివారం నాడు చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. పేరుమోసిన రౌడీషీటర్ సునీల్ హత్య కేసుని సంబంధించి పోలీసులు ప్రియాంకతో పాటు ఆమె తల్లి నాగమ్మను కూడా అరెస్ట్ చేశారు. 

ప్రియాంక పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటించారు. చెన్నపట్టణరాంపుర తోటలోని ఓ ఇంట్లో జనవరి 29న రౌడీషీటర్ సునీల్ ను మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. సునీల్ హత్యకేసులో నటి ప్రియాంక, ఆమె తల్లి నాగమ్మల హస్తం ఉందని నిర్ధారించిన పోలీసులు ఆదివారం నాడు వారిని అరెస్ట్ చేశారు.

కేసు విషయానికొస్తే.. ప్రియాంక కారు డ్రైవర్ గా సునీల్ పనిచేసేవారు. ప్రియాంకకి వరుసకి అత్త కొడుకు కావడంతో సునీల్ ని పనిలో పెట్టుకుంది. అయితే అతడిపై పలు కేసులు నమోదు కావడంతో డ్రైవర్ పని నుండి తీసేశారు. దీంతో సునీల్.. ప్రియాంకకి ఫోన్ చేసి బెదిరించి డబ్బు వసూలు చేసేవాడు.

ప్రియాంక ఆ వేధింపు తట్టుకోలేక తల్లితో కలిసి అతడిని హత్య చేయించిందనేఆరోపణలు ఉన్నాయి. కేరులో వీరి పేర్లు బయటకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రామ్ నగర్ లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Spirit లో విజయ్‌ దేవరకొండ ? పాత్ర ఇదేనా.. వామ్మో బాక్సాఫీసు షేక్ అయ్యే మ్యాటర్‌