మేనమామ వేధిస్తున్నాడు.. నటి కామెంట్స్!

Published : Sep 12, 2019, 09:38 AM ISTUpdated : Sep 12, 2019, 11:18 AM IST
మేనమామ వేధిస్తున్నాడు.. నటి కామెంట్స్!

సారాంశం

మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించారు. ఆస్తి కోసం తన మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని జయశ్రీ సీకె అచ్చుకట్టెపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆ తరువాత మీడియాలో మాట్లాడిన ఆమె తన మావయ్యపై ఆరోపణలు చేసింది. ఆస్తికి సంబంధించి మేనమామ గిరీష్ చాలా కాలంగా తనతో పాటు తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఈ విషయమై ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి హనుమంత నగర్‌లో ఉన్న తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపణలు చేసింది.

తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని చెప్పుకొచ్చారు.  విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా పోలీసులు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌