నేనేమీ బాత్రూమ్ లో దాక్కోలేదు

By Surya PrakashFirst Published Mar 21, 2020, 4:50 PM IST
Highlights

 లక్నో విమానాశ్రయంలో దిగిన ఆమె అక్కడి అధికారులకు చిక్కితే ఎక్కడ తనను నిర్బంధంలో ఉంచుతారోనని వాష్ రూమ్ లో తప్పించుకుని రకరకాల ఇబ్బందులు పడి మొత్తానికి బయటపడిందని వార్తలు వచ్చాయి. 

బేబీ డాల్ సాంగ్ తో ఫేమస్ అయిన కనికా కపూర్ ఇప్పుడు కరోనా వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమె, కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న యూకే నుండి ఇండియాకు తిరిగి వచ్చింది. లక్నో విమానాశ్రయంలో దిగిన ఆమె అక్కడి అధికారులకు చిక్కితే ఎక్కడ తనను నిర్బంధంలో ఉంచుతారోనని వాష్ రూమ్ లో తప్పించుకుని రకరకాల ఇబ్బందులు పడి మొత్తానికి బయటపడిందని వార్తలు వచ్చాయి. 

అలా బయటకు వచ్చిన ఆమె ఇంట్లో తనను తాను నిర్బంధించుకోకుండా   బయట పార్టీలకు అటెండ్ అయింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సదరు గాయనిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా లండన్‌ నుంచి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి పరీక్షలు ఆమె చేయించుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఆమె రివర్స్ లో అవన్నీ సిల్లీ రూమర్స్ అని కొట్టిపారేస్తోంది.ఈ సింగర్ ని ఓ ఆంగ్ల మీడియా ఫోన్‌లో సంప్రదించింది.

ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఎయిర్‌పోర్టులో స్ర్కీనింగ్‌ను తప్పించుకోవడానికి నేను బాత్‌రూమ్‌లో దాక్కున్నానని వస్తున్న వార్తలన్నీ సిల్లీ రూమర్స్‌. ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ వద్ద ఏవిధంగా స్ర్కీనింగ్‌ను తప్పించుకోగలమో చెప్పండి.? అన్నారు. అలాగే  ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన స్ర్కీనింగ్‌ పరీక్షలో నేను పాల్గొన్నాను. ఒకరోజంతా ముంబయిలోనే ఉన్నాను. 

కరోనా కారణంగా సినిమాలకు సంబంధించిన పనులన్నీ రద్దు కావడంతో నా తల్లిదండ్రులు ఇంటికి రమ్మన్నారు. దాంతో నేను మార్చి 11న ఉదయాన్నే లఖ్‌నవూకి విమానంలో వెళ్లాను. ముంబయి నుంచి వెళ్లేవరకూ నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పుడు మరొకరు నా స్వీయ నిర్బంధం ఎలా కోరుకుంటారు. నిజం చెప్పాలంటే నాలుగు రోజుల నుంచే నాలో ఈ లక్షణాలు కనిపించాయి’ అని ఆమె తెలిపారు.

అనంతరం ఆమె ఇచ్చిన పార్టీ గురించి మాట్లాడుతూ.... ‘నేను ఎవరికీ ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. కాకపోతే చిన్న పుట్టినరోజు వేడుకలో మాత్రమే పాల్గొన్నాను. దుశ్యంత్‌ సింగ్‌తోపాటు పలువురు పొలిటీషన్స్  కూడా ఆ పార్టీలో పాల్గొన్నారు. అందరూ చెప్పుకుంటున్నట్లు అది పెద్ద పార్టీ కాదు. 400మంది పాల్గొనలేదు. అందులో నేను ఒక గెస్ట్ ని మాత్రమే. నాతోపాటు పార్టీలో పాల్గొన్న ఇతరుల వివరాల గురించి నేను ఇప్పటికే అధికారులకు చెప్పాను.’ అని ఆమె అన్నారు.
 

click me!