విడాకులు తీసుకున్న రాఘవేంద్రరావు కొడుకు.. మాజీ భార్యతో కలసి!

Published : Aug 01, 2019, 07:50 PM IST
విడాకులు తీసుకున్న రాఘవేంద్రరావు కొడుకు.. మాజీ భార్యతో కలసి!

సారాంశం

టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు. స్టార్ హీరోలతో కలసి తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్రరావు అద్భుతమైన చిత్రాలు అందించారు. రాఘవేంద్రరావు వారసుడిగా ఆయన తనయుడు దర్శకుడిగా మారాడు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ అనగనగా ఓ ధీరుడు చిత్రంతో దర్శకుడిగా మారాడు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కించిన ఆ చిత్రం దారుణంగా నిరాశపరిచింది.   

విరామం తీసుకుని అనుష్కతో సైజ్ జీరో చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం కూడా నిరాశపరిచింది. ప్రకాష్ లేటెస్ట్ గా తెరకెక్కించిన జడ్జిమెంటల్ హై క్యా చిత్రం విజయం దిశగా దూసుకుపోతోంది. కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి ప్రకాష్ భార్య కనికా ధిల్లాన్ కథ అందించారు. దీనితో భార్య, భర్తలు ఇద్దరూ కలసి హిట్ అందుకున్నారని కామెంట్స్ వినిపించాయి. 

తాజాగా కనికా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాన్నిప్రకటించింది. తాను, తన భర్త విడిపోయి రెండేళ్లు అవుతోందని తెలిపింది. మేమిద్దరం విడాకులు తీసుకున్నాం. భార్య, భర్తలుగా విడిపోయినా వృత్తి పరంగా కలసి పనిచేస్తాం అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం