కావాలని కౌగిలించుకొని గట్టిగా నలిపేవాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 7, 2018, 1:54 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను దక్షిణాది బాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో కంగనాకి బాలీవుడ్ క్రేజ్ మరింత పెరిగింది.

అయితే ఈ చిత్ర దర్శకుడు వికాస్ బెహెల్ తనను వేధించాడని సంచలన కామెంట్స్ చేసింది కంగనా. ఇటీవల ఓ యువతి వికాశ్ తనను వేధిస్తున్నాడని మీడియా ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన కంగనా.. వికాశ్ అలాంటి వాడేనని వెల్లడించింది.

''క్వీన్ సినిమా షూటింగ్ సమయంలో వికాశ్ నన్ను ఎప్పుడు కలిసినా.. విష్ చేస్తున్నట్లుగా హగ్ చేసుకునేవాడు. కానీ అతడు నన్ను గట్టిగా పట్టుకొని నలిపేవాడని ఎవరికీ తెలియదు. దాంతో వదిలించుకోవాలని చాలా ప్రయత్నించేదాన్ని.

వికాశ్ కి పెళ్లైనా.. పరాయి మహిళలతో సంబంధాలు పెట్టుకునేవాడు. ప్రేమ, పెళ్లి విషయాల్లో ఇతరుల అలవాట్లను నేను తప్పుబట్టను కానీ ఆ అలవాట్లు వ్యసనంగా మారినప్పుడు బయటకి చెప్పడంలో తప్పు లేదు. అతడు రోజూ రాత్రిళ్లు పార్టీలను వెళ్లేవాడు. నేను షూటింగ్ అయిన తరువాత హోటల్ కి వెళ్లి నిద్రపోయేదాన్ని. దీంతో నన్ను అందరి ముందు ఎగతాళిగా మాట్లాడేవాడు'' అంటూ చెప్పుకొచ్చింది. 
 
click me!