తన సినిమా పేరుతోనే కంగనా ప్రొడక్షన్‌..`మణికర్ణిక`నా మజాకా!

Published : May 02, 2021, 11:18 AM IST
తన సినిమా పేరుతోనే కంగనా ప్రొడక్షన్‌..`మణికర్ణిక`నా మజాకా!

సారాంశం

కంగనా రనౌత్‌ తన కెరీర్‌ పరంగా మరో అడుగు ముందుకేసింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. దీనికి తాను రెండేళ్ల క్రితం నటించిన `మణికర్ణిక` పేరుతోనూ నిర్మాణ సంస్థని ప్రారంభించడం విశేషం.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ అంటే కంగనా రనౌత్‌ పేరే వినిపిస్తుంది. సామాజిక అంశాలను ఆమె రెగ్యూలర్‌గా స్పందిస్తూ నిర్మోహమాటంగా, ధైర్యంగా తన అభిప్రాయాలను పంచుకుంటోంది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకి సంబంధించి నెపోటిజంపై, బాలీవుడ్‌ డ్రగ్స్ రాకెట్‌పై ఆమె బాలీవుడ్‌ పెద్దలపై విరుచుకుపడింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ ఆమె చిన్నపాటి యుద్ధమే చేసింది. బీజేపీ సపోర్ట్ తో ఆమె సరికొత్త ఫైర్‌ బ్రాండ్‌గా మారిపోయింది. 

తాజాగా కంగనా రనౌత్‌ తన కెరీర్‌ పరంగా మరో అడుగు ముందుకేసింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. దీనికి తాను రెండేళ్ల క్రితం నటించిన `మణికర్ణిక` పేరుతోనూ నిర్మాణ సంస్థని ప్రారంభించడం విశేషం. మొదటి ప్రయత్నంగా ఆమె డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. `మణికర్ణిక ఫిల్మ్స్` పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తుంది. సెటైరికల్‌ మూవీ `టికు వెడ్స్ షేరు`తో డిజిటల్‌ మీడియాలోకి వస్తున్నా. మీ ఆశీస్సులు కావాలి` అని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది కంగనా. ఈ సందర్భంగా తన ప్రొడక్షన్‌ లోగోని పంచుకుంది. 

ప్రస్తుతం కంగనా పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న `తలైవి`లో టైటిల్‌ రోల్‌ పోషిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనాతో వాయిదా పడింది. దీంతోపాటు `ధాఖడ్‌`, అలాగే `తేజాస్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్