కాన్సర్‌తో అభిమాని కన్నుమూత.. విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌

Published : May 02, 2021, 09:28 AM IST
కాన్సర్‌తో అభిమాని కన్నుమూత.. విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌

సారాంశం

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవకొండ ఎమోషనల్‌ అయ్యాడు. అభిమాని హఠాన్మరణంతో ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టాడు విజయ్‌. తన టైమ్‌లైన్‌లో నువ్వు ఎప్పటికీ గుర్తిండిపోతావని పేర్కొన్నాడు. 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవకొండ ఎమోషనల్‌ అయ్యాడు. అభిమాని హఠాన్మరణంతో ఆయన చలించిపోయాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టాడు విజయ్‌. తన టైమ్‌లైన్‌లో నువ్వు ఎప్పటికీ గుర్తిండిపోతావని పేర్కొన్నాడు.  విజయ్‌ దేవరకొండకి `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` విజయాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏర్పడింది. విజయ్‌ ని ఆరాధించే అభిమానులు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చిందంటే ఒక్క విజయ్‌ దేవరకొండకే అని చెప్పొచ్చు. 

అయితే హేమంత్‌ అనే తన అభిమాని ఇటీవల కాన్సర్‌తో మంచాన పడ్డాడు. హేమంత్‌ చివరి కోరిక మేరకు అతడితో వీడియో కాల్‌ మాట్లాడారు విజయ్‌. ఆ సమయంలో అతని కోసం తన `రౌడీవేర్‌` నుంచి టీషర్ట్ లు కూడా పంపించాడు. అవి తనకు అందాయి. కానీ ఇంకా వేసుకోలేదు.  తాజాగా అతడు మరణించాడన్న వార్తతో విజయ్‌ చలించిపోయాడు. తన అభిమాని,తాను స్వయంగా మాట్లాడిన అభిమాని తుదిశ్వాస విడవడంతో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు.

ఈ సందర్భంగా విజయ్‌ స్పందిస్తూ, `ఐ మిస్‌యూ హేమంత్‌.. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ మధురమైన చిరునవ్వును చూశాను, నీ ప్రేమను ఫీల్‌ అయ్యాను. అదే ప్రేమను నీకు పంచాను. కళ్లలో నీళ్లు తిరగుతున్నాయి. కన్నీళ్లతో నీకోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. ఇతడిని నాదాకా చేరుకునేలా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. హేమంత్‌ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. నీ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంచుకుంటాను` అని ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పంచుకున్నాడు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.

విజయ్‌ దేవకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పూరీ, చార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కరోనాతో నిలిచిపోయింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్