ఆదిపురుష్ పై పరోక్షంగా కంగనా రనౌత్ చురకలు.. ప్రభాస్ హీరోయిన్ కి కూడా నచ్చినట్లు లేదే..

Published : Jun 19, 2023, 03:14 PM ISTUpdated : Jun 19, 2023, 03:17 PM IST
ఆదిపురుష్ పై పరోక్షంగా కంగనా రనౌత్ చురకలు.. ప్రభాస్ హీరోయిన్ కి కూడా నచ్చినట్లు లేదే..

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి ముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి ముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. రిలీజ్ తర్వాత విమర్శలు, ట్రోలింగ్, సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ప్రభాస్ క్రేజ్, రామాయణం బ్యాక్ డ్రాప్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర జోరు తగ్గడం లేదు. 

మూడు రోజుల్లోనే అదిపురుష్ 300 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే పలు వర్గాల నుంచి ఆదిపురుష్ చిత్రంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. రామాయణ పురాణ గాధతో తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ చిత్రంలో పాత్రలు, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన విధానం, డైలాగ్స్ పై ఆడియన్స్ లో ఫోకస్ ఎక్కువగా ఉంది. అలాగే గ్రాఫిక్స్ పై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. 

దర్శకుడు ఓం రౌత్ రామాయణంలోని అంశాలని అనుసరించకుండా హాలీవుడ్ హర్రర్ చిత్రాల స్టైల్ ని ఫాలో అయినట్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే తాజాగా ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగన రనౌత్ ఆదిపురుష్ చిత్రంపై పరోక్షంగా చురకలంటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

'కొన్నేళ్ల క్రితమే ప్రజల భాష, వారి బాడీ లాంగ్వేజ్, బ్రీతింగ్ చాలా డిఫరెంట్ గా ఉండేది. అన్ని ఎమెషన్స్ లో వారి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉండేది. ఇక 7 వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవారో, ఎంత భిన్నంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు అని కంగనా పోస్ట్ చేసింది. ఆదిపురుష్ చిత్రంలో పాత్రలు ఇప్పటి హాలీవుడ్ చిత్రాల్లో బిహేవ్ చేసినట్లు ఉన్నాయని కంగనా పరోక్షంగా ఈ కామెంట్స్ చేసింది. కంగనా చేసిన ఈ పోస్ట్ పరోక్షంగా ఆదిపురుష్ చిత్రానికి కౌంటర్ అనే నెటిజన్లు భావిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం ప్రభాస్ హీరోయిన్ నే డిజప్పాటింగ్ చేసిందన్నమాట. కంగనా రనౌత్, ప్రభాస్ ఏక్ నిరంజన్ చిత్రంలో జంటగా నటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్