ఇద్దరు హీరోయిన్ల కొట్లాట.. కారణమేమిటంటే..?

Published : Oct 08, 2018, 01:29 PM IST
ఇద్దరు హీరోయిన్ల కొట్లాట.. కారణమేమిటంటే..?

సారాంశం

బాలీవుడ్ లో లైంగిక వేధింపులపై తనుశ్రీదత్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకి మద్దతు తెలుపుతూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది.

బాలీవుడ్ లో లైంగిక వేధింపులపై తనుశ్రీదత్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకి మద్దతు తెలుపుతూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది.

'క్వీన్' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వికాస్ బెహల్ ఆమెతో తప్పుగా ప్రవర్తించేవాడని కంగనా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై స్పందించింది హీరోయిన్ సోనమ్ కపూర్. ఇండస్ట్రీలో ఉన్న బలవంతులైన నటులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అంత తేలికైన సంగతి కాదని, ఈ విషయంలో తనుశ్రీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని అంది.

అలానే కంగనా చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ.. 'కంగనాని అన్ని సార్లు నమ్మలేం. ఆమె తాను నమ్మిన విషయానికి కట్టుబడి ఉంటుంది. నేను ఆ విషయాన్ని ఎంతో గౌరవిస్తాను. కానీ పూర్తిగా నిజాలు తెలియకుండా.. ఆమె చేసే వ్యాఖ్యలను నమ్మలేం. ఒకవేళ అవి నిజమైతే ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం'అంటూ చెప్పుకొచ్చింది.

అయితే సోనమ్ చేసిన కామెంట్స్ పై కంగనా మండిపడుతుంది. అసలు నన్ను జడ్జ్ చేయడానికి సోనమ్ ఎవరంటూ ప్రశ్నించింది. ఇండస్ట్రీలో దశాబ్దం పాటు పోరాడి సొంత గుర్తింపు తెచ్చుకున్నానని, సోనమ్ లాగా తల్లితండ్రుల కారణంగా గుర్తింపు రాలేదంటూ ఫైర్ అయింది. 

సంబంధిత వార్త.. 

కావాలని కౌగిలించుకొని గట్టిగా నలిపేవాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్!

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్