ఆ సింగర్ నా తొడలపై చేతులు వేసి.. మహిళా జర్నలిస్ట్ ఆవేదన!

Published : Oct 08, 2018, 12:27 PM ISTUpdated : Oct 08, 2018, 12:28 PM IST
ఆ సింగర్ నా తొడలపై చేతులు వేసి.. మహిళా జర్నలిస్ట్ ఆవేదన!

సారాంశం

ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తోన్న ఓ మహిళా జర్నలిస్ట్ సింగర్ ఖైలాస్ ఖేర్ అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్ జుల్ఫీ సయ్యద్ లు లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేస్తోంది. ఆమె కొన్ని విషయాలను భయతపెట్టింది. 

ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తోన్న ఓ మహిళా జర్నలిస్ట్ సింగర్ ఖైలాస్ ఖేర్ అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్ జుల్ఫీ సయ్యద్ లు లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేస్తోంది. ఆమె కొన్ని విషయాలను భయతపెట్టింది.

''నా వృత్తిలో భాగంగా నేను నా సహోద్యోగి అయిన మరో మహిళా రిపోర్టర్ తో కలిసి సింగర్ కైలాష్ ఖేర్ ఇంటికి  ఇంటర్వ్యూ కోసం వెళ్లాం. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో అతడు మెల్లగా మా ఇద్దరి మధ్యలో కూర్చొని మా తొడలపై చేతులు వేశాడు.

దీంతో అక్కడ నుండి వీలైనంత త్వరగా మేము బయటపడ్డాం. ఆ విషయాన్ని బయటపెట్టాలని అనుకున్నా.. మా కొలీగ్ మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి దాన్ని మనం నిరూపించలేమని చెప్పింది'' అంటూ సింగర్ కైలాష్ తమతో ప్రవర్తించిన తీరుని వెల్లడించింది.

మరోసారి బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ జుల్ఫీ సయ్యద్ తనను లోబరుచుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది. ఓ ఈవెంట్ లో భాగంగా షిప్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినప్పుడు.. ఆమె ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో జుల్ఫీ సయ్యద్ రూమ్ లో చార్జింగ్ పెట్టుకుందట.

ఫోన్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అతడు తనను లోబరుచుకోవడానికి ప్రయత్నించాడని, తెలివిగా అక్కడ నుండి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది మహిళా జర్నలిస్ట్. అయితే జుల్ఫీ తప్పు తెలుసుకొని ఆమెకి తరువాతి రోజు క్షమాపణ చెప్పాడని స్పష్టం చేసింది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !