కావాలనే కంగనాను దూరం పెడుతున్నా.. కావాలనే ఆమెను పిలవడం లేదు అంటూ.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హోస్ట్ కరణ్ జోహార్ పై మండిపడతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటీ..?
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటే .. కంగనా మాత్రం ఒక వైపు ఉంటుంది. బీ టౌన్ లో జరిగే అన్యాయాలను ఫిల్టర్ లేకుండా బయటపెట్టి.. ఎంతటివారైనా నిలబెట్టికడిగేస్తుంది. అంతే కాదు ప్రతీ విషయంలో స్పందిస్తూ.. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఫైర్ బ్రాండ్ఇమేజ్ ను సాధించింది కంగనా. దాంతో ఆమె బాలీవుడ్ లో చాలా స్పెషల్ అనిపించుకుంది. ముఖ్యంగా నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ లపై ఆమె ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది.
ఇక ఆమెకు భయపడి కొంతమంది..ఆమె అంటే ఇష్టం లేక మరికొంత మంది కంగనాను దూరంపెడుతూ వస్తున్నారు. బాలీవుడ్ లో జరిగే కార్యక్రమాలుకు ఆమెను పిలవరు. ఈ విషయంలో ఎన్నో విమర్షలు కూడా ఫేస్ చేస్తున్నారు బీ టౌన్ స్టార్స్. తాజాగా ఈ విషయంలో నెటిజన్ల చేత తిట్లు కూడా తిన్నారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. డైరెక్టర్ గా , ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన కరణ్ జోహార్.. హోస్టుగా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఆయన హోస్టింగ్ చేస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’. బాలీవుడ్ స్టార్స్ పాల్గొనే ఈ షో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 8వ సీజన్ టెలీకాస్ట్ కు రెడీ అవుతోంది.
ఇక తాజాగా 8 సీజన్ అక్టోబర్ 26 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయబోతున్నారు. తాజాగా సీజన్ గెస్టుల లిస్టులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ సహా పలువురు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరు లేకపోవడంపై నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. కేవలం నెపో కిడ్స్ ను మాత్రమే ఈ షోకు పిలుస్తారంటూ కరణ్ పై విమర్శలు చేస్తున్నారు.
Excited about Karan Johar's guest list, but disappointed that Kangana Ranaut won't be there? The promo had us hoping for a powerhouse duo on the couch! Unfair, considering she has coming to the big screen!
— चंदू (@Chanduhuu)కంగనా రనౌత్ కు సినిమా అవకాశాలు ఇవ్వకపోయినా..ఆమె సొంతగా సినిమాలు చేస్తున్నారు. సౌత్ లో కూడా ఆఫర్లు సాధిస్తోంది. ఆమె తాజాగా ప్రయోగాత్మక మూవీ తేజస్ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి ఆమె సినిమా రిలీజ్ కు ఉంటే.. అందరితో పాటు.. ఆమెను కూడా ఈ షోకు పిలవాలి కదా.. మరి కంగనాను ఎందుకు గెస్టుగా పిలవలేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ఎప్పుడూ ఆశ్చర్యపడదు! కరణ్ జోహార్ ప్రతిభావంతులైన నటులను కాకుండా నేపో కిడ్స్ ను మాత్రమే తన షోకు పిలుస్తారు. కాఫీ విత్ కరణ్-8 గెస్టుల లిస్టులో ఎవరు మిస్ అయ్యారో ఊహించండి!” అంటూ నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.
has always invited big celebrities on Koffee With Karan, but don't know what's wrong this time! Knowing is having her film Tejas around the corner for the release, he invited the new kids, nepo kids! Why ?
— Shivani (@imshivani143)మరో అభిమాని ట్వీట్ చేస్తూ, కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ గెస్ట్ లిస్ట్ లో కంగనా రనౌత్ తప్ప అందరూ ఉన్నారు.. తన సినిమా విడుదలకు సిద్ధమవుతోందని తెలిసి కూడా గెస్టుగా పిలువలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్ జోహార్ ఎప్పుడూ స్టార్ యాక్టర్స్ ను కాఫీ విత్ కరణ్ షోకు ఆహ్వానిస్తారు. అని విమర్షిస్తున్నారు. మరి ఈ విషయంలో వారు ఏం స్పందిస్తారో చూడాలి.
’s Koffee with Karan guest list has pretty everyone but Kangana Ranaut! Nepo kids se leke sab hai! But nahi, despite knowing that her film is gearing up for release! How is it fair?
— Smriti (@smriti915)