ప్రభాస్ ‘కల్కి’తో పోలిక పెట్టారు..రిజల్ట్ ఏమైంది?

By Surya Prakash  |  First Published Oct 21, 2023, 1:52 PM IST

దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20వ తేదీన గణపథ్ సినిమా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ సినిమా రిలీజైంది.  ఫ్యూచరస్టిక్ యాక్షన్ సినిమాగా  వచ్చిన...


 బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గణపథ్ మూవీ. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందొంది. వికాస్ బాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20వ తేదీన గణపథ్ సినిమా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ సినిమా రిలీజైంది.  ఫ్యూచరస్టిక్ యాక్షన్ సినిమాగా  వచ్చిన ఈ చిత్రం తొలి రోజు కేవలం మూడు కోట్లు మాత్రమే కలెక్షన్స్ తెచ్చుకుని డిజాస్టర్ అనిపించుకుంది. ఈ హీరోకు ఇదే అత్యంత తక్కువ ఓపినింగ్ చిత్రం. 

గణపథ్ మూవీ స్టోరీ 2070 సంవత్సరం (2070 AD)లో జరిగే కథ . అప్పడు డబ్బున్నవాళ్లు లేని వాళ్లుగా ప్రపంచం  విడిపోయి ఉంటుంది.  ధనవంతులు ఉండే సిల్వర్ సిటీలో  రోబోలు, డ్రోన్లు ఎక్కువ. టెక్నాలిజీదే ప్రధన స్దానం. వేరొకటి గరీబొంకి బస్తీ. అదో పేదవాళ్ల అడ్డా. ప్రైవేట్ మిలటరీ డ్రెస్‍లు వేసుకున్న కొందరు ప్రజలను.. వేధిస్తుంటారు. వారిని రక్షించేందుకు వీరుడు వస్తాడని అతనే గణపథ్ అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కారణజన్ముడే హీరో గుడ్డు(టైగర్ శ్రోఫ్). ఇతడేమో డబ్బున్న వాళ్ళ వైపు ఉంటాడు. కాల క్రమేనా గుడ్డూకి జ్ఞానోదయం కలిగి అన్నార్తుల కోసం ఏం చేసి, వాళ్ల కోసం పోరాడాడు అనేది గా స్టోరీ.  హీరోయన్ కృతి సనన్ కూడా యాక్షన్ అవతార్‌లో కనిపించింది.

Latest Videos

   ఏ హీరో ఈజ్ బార్న్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ చిత్రం ఏ రకంగానూ ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి.  మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, డిస్ట్రిక్ట్ 9, ఎలిసియం లాంటి హాలీవుడ్ మూవీస్ ని  కాపీ కొట్టి  దర్శకుడు వికాస్ బహ్ల్  ఈ సినిమాని దారుణంగా తీసాడన్నారు.  చాలా బోర్ గా ఉందని అంటున్నారు. ఇక రిలీజ్ కు ముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్లోబల్ సూపర్ హీరో మూవీ ‘కల్కి 2898 ఏడీ’తో ఈ గణపథ్ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు కారణం  ఈ రెండు చిత్రాలు ఫ్యుచరిస్టక్ థీమ్‍తో తెరకెక్కటమే. కల్కి చిత్రంలో మహావిష్ణువు 10వ అవతారమైన కల్కిగా నటిస్తున్నారు ప్రభాస్. గణ్‍పథ్ చిత్రంలో వినాయకుడికి హీరో పాత్రకు సంబంధం ఉండేలా కనిపించారు. ఈ రెండు చిత్రాల్లోనూ అమితాబ్ బచ్చన్ దాదాపు ఒకేలాంటి పాత్ర చేసినట్లు అనిపించదన్నారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావటంతో పోలిక సమస్యే లేకుండా పోయింది.
 

click me!