రాజకీయాలపై కంగనా సంచలన వ్యాఖ్యలు!

Published : Apr 30, 2019, 12:01 PM ISTUpdated : Apr 30, 2019, 02:49 PM IST
రాజకీయాలపై కంగనా సంచలన వ్యాఖ్యలు!

సారాంశం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ తన వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ తన వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ పైకామెంట్స్ చేసి విమర్శల పాలైన ఈ బ్యూటీ తాజాగా రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందించింది. 

సోమవారం జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం ఇప్పుడు వచ్చిందని, ఈ ప్రభుత్వం రావడానికి ముందు వరకు కూడా మొగలాయిలు బ్రిటీష్ వారు ఇటాలియన్ గవర్నమెంట్ ఉండేదని అప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

గత ప్రభుత్వాల హయాంలో ఎక్కడ చూసిన పేదరికం కాలుష్యం అత్యాచారాలు ఉండేవని.. ఇప్పుడు మాత్రమే స్వరాజ్యం సాగుతుందని కంగనా పేర్కొంది. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్