మణికర్ణిక: రిలీజ్ విషయంలో కంగనా రనౌత్ మొండి పట్టు?

Published : Dec 12, 2018, 04:36 PM IST
మణికర్ణిక: రిలీజ్ విషయంలో కంగనా రనౌత్ మొండి పట్టు?

సారాంశం

భారీ బడ్జెట్ సినిమాలకు విడుదలయ్యే ముందు వివాదాలు ఎదురవ్వడం కామన్. అయితే సినిమాను తేరకెక్కించే చిత్ర యూనిట్ సభ్యుల మధ్యలోనే గొడవలు ఉంటె సినిమాపై ఎంతో కొంత ప్రభావం చూపకమానదు. ఇప్పుడు మణికర్ణిక సినిమా పై కూడా అదే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి.

వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత ఆధారంగా రానున్న మణికర్ణిక సినిమా మొదలైనప్పుడే కొన్ని సంఘాల నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ఇక ఆ తరువాత షూటింగ్ చివరి దశలో ఉండగా దర్శకుడు క్రిష్ డ్రాప్ అయిపోవడం మరొక సెన్సేషన్. కంగనా రనౌత్ మొండితనం వల్లే క్రిష్ నిష్క్రమించాడని అందరికి తెలిసిపోయింది. 

మిగతా షెడ్యూల్ ను కంగనా తన డైరెక్షన్ లో పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అమ్మడు నిర్మాతలకు ఇష్టం లేకపోయినా వారిని బలవంతంగా ఒప్పించి సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2019 జనవరి 25న మణికర్ణిక రిలీజవ్వలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందట. అయితే బయ్యర్స్ ఆ టైమ్ లో వద్దని చెప్పినట్లు టాక్. 

అదే విధంగా హిందీతో పాటు తమిళ్ తెలుగులో కూడా సినిమా రిలీజ్ కానుంది.ఇక  జనవరి 24న క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ రిలీజయ్యే అవకాశం ఉంది. కంగనా ఏ మాత్రం ఆలోచించకుండా పలు బాలీవుడ్ సినిమాలు కూడా ఆ టైమ్ లో రిలీజవుతుంటే అన్ని భాషల్లో ఒకేసారి రిలీజవ్వలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?