Rashmika Engagement Breakup : ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై రష్మిక మండన్నకు నెటిజన్ ప్రశ్న.. ఆన్సర్ ఏంటంటే..

Published : Mar 12, 2022, 12:07 PM IST
Rashmika Engagement Breakup : ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై రష్మిక మండన్నకు నెటిజన్ ప్రశ్న.. ఆన్సర్ ఏంటంటే..

సారాంశం

ఆల్ ఇండియా క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మండన్న (Rashmika Mandanna) ఎంగేజ్ మెంట్,  పెళ్లిపై అభిమానుల్లో ఇంకా ఆసక్తి నెలకొనే ఉంది. ఇటీవల ఓ నెటిజన్ ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ రష్మిక మండన్న (Rashmika Madanna) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా, ట్విట్టర్ లో మొత్తంగా 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్, తన మూవీ అప్డేట్స్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది. మరోవైపు క్లీవేజ్‌ అందాలతో విరహాలు పోతూ కుర్రాళ్లకి చెమటలు పట్టించడంలో రష్మిక ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు ట్విట్టర్, ఇన్ స్టాలో తన హవా చూపిన రష్మిక మండన్న తాజాగా తన య్యూటూబ్ ఛానెల్ ను ప్రారంభించింది.  

ప్రస్తుతం వరుస సినిమాల సక్సెస్‌ తో దూసుకుపోతోంది రష్మిక. గతేడాది పుష్ప (Pushpa) మూవీలో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీతో రష్మిక పాపులారిటీ డబుల్ అయ్యింది. ఇటీవల హీరో  శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో నటించి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.  అయితే నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నెట్టింట సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా యూట్యూబ్‌లో అడుగు పెట్టింది. రెండేళ్ల కిందనే ‘రష్మిక మండన్న’ పేరుతో ఛానెల్ క్రియేట్ చేసినా.. పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా ఉంటోంది. ఈ సందర్భంగా గురువారం నెటిజన్లతో లైవ్ సెషన్ నిర్వహించింది.

ఈ సందర్భంగా రష్మికకు ఫ్యాన్స్‌ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటినికి బదులిచ్చింది రష్మిక. అయితే  ఓ నెటిజన్ తన ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై ప్రశ్నించాడు. ‘మీ ఎక్స్ లవ్, ఎంగేజ్ మెంట్ బ్రెకప్ పై తెలుసుకోవాలని ఉంది’ అంటూ అడిగిన ప్రశ్నకు రష్మిక ఎలాంటి బదులివ్వలేదు. మౌనంగా ఉండిపోయింది. దీంతో అసలు ఎందుకు రష్మిక మండన్న నిశ్చితార్థం ఎందుకు బ్రేక్ అయిందనే విషయంపై అంతటా ఆసక్తి నెలకొంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో డేటింగ్ లో ఉన్నట్టు కూడా ఎప్పటి నుంచో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 

రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ పెళ్లిపై అడిగిన  ప్రశ్నకు ‘ఇంకా చాలా సమయం పడుతుంది’ అంటూ బదులిచ్చింది. కన్నడ మూవీ ‘కిర్రిక్ పార్టీ’ హీరో రక్షిత్ తో రష్మికకు 2018లో నిశ్చితార్థం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన గీతా గోవిందం మూవీ అనంతరం రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్‌ చేసుకుంది. అప్పట్లో కన్నడ పరిశ్రమలో ఈ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. కేరీర్ విషయానికొస్తే ఈ ఏడాదిలో రష్మిక మండన్న ఏకంగా రెండు సినిమాలతో హిందీ ప్రేక్షకులను అలరించనుంది. ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ మూవీలో నటించింది. అలాగే పుష్ప 2: ది రూల్ మూవీలోనూ నటిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?