సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ చిన్నపిల్లలు.. కమల్‌ హాసన్‌ `కల్కి 2898 ఏడీ` సక్సెస్‌ నోట్‌ వైరల్‌

Published : Jul 16, 2024, 04:07 PM ISTUpdated : Jul 16, 2024, 04:08 PM IST
సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ చిన్నపిల్లలు.. కమల్‌ హాసన్‌  `కల్కి 2898 ఏడీ` సక్సెస్‌ నోట్‌ వైరల్‌

సారాంశం

కమల్‌ హాసన్‌.. `భారతీయుడు 2` ఫలితాన్ని పక్కన పెట్టి `కల్కి 2898 ఏడీ` సినిమా గురించి మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో వైరల్‌ అవుతుంది.    

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ`లో ఆయన నెగటివ్‌ రోల్‌ చేశారు. క్లైమాక్స్ లో కాసేపు కనిపించి అదరగొట్టారు. అలాగే ఆయన హీరోగా `భారతీయుడు 2` తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఘోర పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. `కల్కి 2898 ఏడీ`పై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సినిమా సక్సెస్‌ గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇందులో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ, నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాకి మెయిన్‌ యూఎస్‌పీ ఐడియా అని, ఇలాంటి ఐడియాతో సినిమా చేసిన నాగ్‌ అశ్విన్‌ని అభినందించారు. ఆయన్ని చిన్నపిల్లాడితో పోల్చాడు కమల్‌. నాగ్‌లో చిన్నపిల్లాడిని గుర్తించినట్టు తెలిపారు. చిన్నపిల్లలు గేమ్‌ ఆడుతుంటే మనం చూస్తుంటాం. ఆ తర్వాత అందులో ఇన్‌వాల్వ్ అవుతుంటాం. ఆ గేమ్‌ ఆడేంత సేపు మనకు వాళ్లు స్టఫ్‌ ఇస్తారు. అలా `కల్కి`సినిమా విషయంలో నాగ్‌ అశ్విన్‌ ఆ పని చేశాడని, ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు అలా చిన్నపిల్లాడిలా చేశారని, ఇప్పుడు నాగ్‌ కోవలోకి వస్తాడని చెప్పారు కమల్‌. `కల్కి` టీమ్‌ని ఆయన ఓ ఫ్యామిలీలాగా డీల్‌ చేసినట్టు తెలిపారు.  

ఇప్పటి వరకు 250 సినిమాలు చేశా, రెండు మూడు చాలా లేజీగా ఉంటాయి. కానీ వీటిలో ఏ మూవీ కూడా ఇంతటి అటెన్షన్‌ క్రియేట్‌ చేయలేదు. ఇలాంటి సెలబ్రేషన్‌ జరగలేదు. సినిమా చేసేటప్పుడు ఏం చేస్తున్నామో మాకు అర్థం కాలేదు. నా పాత్రలో కొంత వాయిలెన్స్ ఉంటుంది. ఆ గెటప్ వేసుకున్నప్పుడు కొంత అసౌకర్యంగా అనిపించింది. కానీ చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఇది కేవలం ఒక పాత్ర మాత్రమే. ఇందులో అలాంటివి పది పాత్రలున్నాయి. ఇండియాలోనే బిగ్‌ స్టార్స్ కలిసి చేశాం. నాగ్‌ అశ్విన్‌ ఒక మ్యాజిక్‌ చేశాడు. సినిమా తీయడమే కాదు, రైట్‌ టైమ్‌లో రిలీజ్‌ చేశారు. దీంతోనే ఈ మూవీ ఇంతటి పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు వెయ్యి కోట్లు వసూలు చేసిందంటున్నారు. ఇక్కడ మనీ గురించి మ్యాటర్‌ కాదు, సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నాం, తాము ఎంజాయ్ చేశాం, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం` అంటూ పేర్కొన్నారు కమల్‌. రెండో పార్ట్ లో తన పాత్ర ఎక్కువ ఉంటుందని, వాయిలెన్స్ కూడా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ నటించిన `భారతీయుడు 2` ఆకట్టుకోలేకపోయింది. దీని గురించి ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఇక నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్క 2898ఏడీ` చిత్రంలో కమల్ హాసన్‌ సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించారు. అమిాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, ప్రభాస్‌ భైరవ పాత్రలో కనిపించగా, సుమతిగా దీపికా పదుకొనె, రాక్సీగా దిశా పటానీ, మరియమ్మగా శోభన కనిపించారు. పైలట్‌గా దుల్కర్‌ సల్మాన్‌, అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ మెరిసి మ్యాజిక చేశారు. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లని సాధించింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌ 2` కలెక్షన్లై కన్నేసింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?