మంత్రి రోజా ఇంటిలో జబర్దస్త్ ప్రేమికులు!

By Sambi ReddyFirst Published Jan 25, 2023, 3:49 PM IST
Highlights


జబర్దస్త్ లవ్ బర్డ్స్ రాకింగ్ రాకేష్-సుజాత త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరికీ మంత్రి రోజా మరచిపోలేని ట్రీట్ ఇచ్చారు. ఇంటికి పిలిచి ఆతిథ్యం అందించారు. 
 

టెలివిజన్ ప్రెజెంటర్ జోర్దార్ సుజాతను రాకింగ్ రాకేష్ ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్ వేదికగా వీరి ప్రేమ కథ మొదలైంది. సుజాత జోర్దార్ షోతో పాప్యులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే అవకాశం సుజాతకు దక్కింది. హౌస్లో ఎక్కువ వారాలు ఉండకుండా ఫేమ్ అయితే రాబట్టారు. దాంతో ఆమె జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రాకేష్-సుజాత దగ్గరయ్యారు. 

బుల్లితెర స్టార్స్ ఉత్తిత్తి ప్రేమల గురించి తెలిసిన ఆడియన్స్ రాకేష్-సుజాతల కహానీ కూడా అలాంటిదే అనుకున్నారు. వారిది సీరియస్ లవ్ స్టోరీ అని మెల్లగా తెలిసొచ్చింది. ప్రస్తుతం రాకేష్ ఇంట్లోనే సుజాత ఉంటుంది. వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది. ముఖ్యంగా రాకేష్ తల్లి కోడలి పట్ల సంతోషంగా ఉన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సుజాత పై పొగడ్తల వర్షం కురిపించారు. 

కాగా జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన రాకింగ్ రాకేష్ కి రోజాతో మంచి అనుబంధం ఉంది. రోజా సైతం రాకేష్ పై అమితమైన ప్రేమ చూపిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో రోజాను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటాడు. రోజాతో చనువు కలిగిన రాకేష్ ఆమె ఇంటికి సుజాతతో పాటు వెళ్లారు. రోజా అప్పుడు ఇంట్లో లేరు. రోజా వచ్చే లోపు రాకేష్ స్వయంగా వంట చేశారు. రోజాకు ఇష్టమైన ఆలు ఫ్రై చేశారు. 

అనంతరం రోజాతో కలిసి రాకేష్-సుజాత భోజనం చేశారు. స్వయంగా తన కారులో ఇద్దరినీ తీసుకెళ్లి తిరుమల శ్రీవారి దర్శనం చేయించారు రోజా. సుజాతకు పట్టు చీర, తాంబూలం పెట్టారు. రోజా ఆతిధ్యానికి రాకేష్-సుజాత మురిసిపోయారు. ఇదంతా రికార్డు చేసిన తన యూట్యూబ్ ఛానల్ లో రాకేష్ పోస్ట్ చేశారు.  కాగా త్వరలో రాకేష్-సుజాత వివాహం చేసుకొని తమ బంధాన్ని అధికారికం చేసుకోనున్నారని సమాచారం. 
 

click me!