మరో రికార్డు క్రియేట్ చేయబోతున్న కమల్ హాసన్.. ‘ఇండియన్ 2’లో దిమ్మతిరిగిపోయే డైలాగ్.. డిటేయిల్స్?

Published : Sep 16, 2022, 01:42 PM IST
మరో రికార్డు క్రియేట్ చేయబోతున్న కమల్ హాసన్.. ‘ఇండియన్ 2’లో దిమ్మతిరిగిపోయే డైలాగ్.. డిటేయిల్స్?

సారాంశం

లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇండియన్ 2’లో మరోసారి నటవిశ్వరూపం చూపించనున్నారు.   

‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్ రీస్టార్ట్ కావడంతో సౌత్ ఆడియెన్స్  ఎంతగానో ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ (Kamal Haasan) ఫ్యాన్స్ ఈ చిత్రం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్.. Indian 2తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయి.. రీస్టార్ట్ కావడంతో తాజాగా క్రేజీగా అప్డేట్ అందింది. ఈ చిత్రంలో చెప్పే ఓ డైలాగ్ తో  నట విశ్వరూపం చూపించనున్నారంట. 

తాజాగా ‘ఇండియన్ 2’ కోసం చెప్పిన డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలవనుందంట. సింగిల్ టేక్ లో 14 భాషల్లో ఉన్న డైలాగ్ ను చెప్పడం  పట్ల చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. 10 నిమిషాల పాటు ఆగకుండా కమల్ హాసన్ డైలాగ్ చెప్పారని, దీంతో కమల్ హాసన్ మరో రికార్డును క్రియేట్ చేయబోతున్నారని కోలీవుడ్ లో టాక్ క్రియేట్ అయ్యింది. కమల్ హాసన్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఆయన అభిమానులు, ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ గా రూపొందుతున్నది. ఇప్పటికే 30 శాతానికి పైగా చిత్ర షూటింగ్ పైర్తైనట్టు తెలుస్తోంది. 

కమల్ హాసన్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. ఈ క్రేజీ న్యూస్ అందడంతో సంతోషిస్తున్నారు. సినిమాపైనే హైప్ క్రియేట్ అవుోంది. మరోవైపు చిత్రం రన్ టైం కూడా 3 గంటలకు పైగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. శంకర్ కేరీర్ లోనే ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేస్తుందంటున్నారు. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఆర్సీ 15’, ఇటు కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ చిత్రాలను పార్లల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ నెల వచ్చే వారంలో నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తిచేయాలని చూస్తున్నారు. మూవీలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ కడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

Samantha Remuneration: `మా ఇంటి బంగారం`కి సమంత పారితోషికం ఎంతో తెలుసా? కొడితే కుంభస్థలమే
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !