డబ్బింగ్ థియేటర్ లో కమల్ హాసన్ , శంకర్ సందడి, స్టార్ట్ అయిన ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్..

By Mahesh Jujjuri  |  First Published Oct 10, 2023, 5:42 PM IST

ఎలాగోలా షూటింగ్ అయిపోయింది... ఇక పోస్ట్ ప్రొడక్షన్ మిగిలుంది.. ఆ కాస్త కానిచ్చేయాలి అనుకుంటున్నాడు శంకర్. అందుకే ఇండియాన్ 2 పై గట్టిగా దృష్టి పెట్టాడు. తాజాగా అప్ డేట్ కూడా ఇచ్చాడు. 


ఎలాగోలా షూటింగ్ అయిపోయింది... ఇక పోస్ట్ ప్రొడక్షన్ మిగిలుంది.. ఆ కాస్త కానిచ్చేయాలి అనుకుంటున్నాడు శంకర్. అందుకే ఇండియాన్ 2 పై గట్టిగా దృష్టి పెట్టాడు. తాజాగా అప్ డేట్ కూడా ఇచ్చాడు. 

ప్రస్తుతం తెలుగు,తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్‌ సినిమాలు పాన్ ఇండియాను ఆకర్షిస్తున్నాయి. అందులో తమిళం నుంచి రాబోతున్న ఇండియన్‌-2 కూడా ఉంది.  ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.  తొలి భాగం బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి నిర్మాతల పాలిట కనకవర్షం కురిపించింది. ఇక తాజాగా అంతకు మించి విజయం లక్ష్యంగా ఇండియన్ 2 మూవీ రెడీ అవుతోంది. 

Latest Videos

అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్‌ డైరెక్షన్‌, కమల్‌ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. కాని ఏమంటా ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ చేశారో.. అప్పటి నుంచి.. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. ప్రమాదాలు, గొడవల కారణంగా చాలా కాలం ఆగిపోయిన ఈసినిమా షూటింగ్.. కమల్ హాసన్ చొరవతో మళ్ళీ మొదలయ్యింది. ఇటు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తూనే.. అటు ఇండియన్ 2ని కూడా కంప్లీట్ చేశాడు శంకర్. తాజాగా పోస్ట్ ప్రొడక్షనర్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.  

కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేకుండా వున్న ఇండియన్‌ 2 ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ పనులు షురూ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అందులో శంకర్‌, కమల్‌ హాసన్‌ ఇద్దరూ డబ్బింగ్‌ స్టూడియోలో కనిపించారు. విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్…ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌, తమన్నా కూడా  కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక స్వరాలతో సంచలనం సృష్టిస్తోన్న స్వర తరంగం అనిరుధ్ రవిచందర్ ఈసినిమాకు సంగీతం అదిస్తున్నారు. రీసెంట్ గా జైలర్ సినిమాతో ఆయన చేసిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఇక స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను రెడ్‌ జియాంట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఇండిపెండెన్స్‌ డేకు రిలీజైన కమల్‌ లుక్‌కు విశేష స్పందన వచ్చింది.

click me!