తమిళ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య 21 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ మూమెంట్ వచ్చింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఎంతో మర్యాద, ప్రేమగా పలకరించుకున్నారు. దీంతో అభిమానులు మురిసిపోతున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) - సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) మధ్య వీడదీయలేని అనుబంధం, మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ప్రతి విషయాల్లోనూ ఒకరినొకరూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే చెరగని ముద్ర వేసుకున్న ఈ అగ్ర హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతున్నారు. భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం రజినీకాంత్ Thalaivar 170 చిత్రంలో నటిస్తున్నారు. కమల్ హాసన్ అటు శంకర్ దర్శకత్వంలోని Indian 2లో నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య 21 ఏళ్ల తర్వాత క్రేజీ మూమెంట్ మళ్లీ వచ్చింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఎంతో మర్యాద, ప్రేమగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
undefined
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియన్ 2 కోసం కమల్ హాసన్, ‘తలైవార్ 170’ కోసం రజనీకాంత్ చెన్నైలోని ఓ స్టూడియోకు చేరుకున్నారు. ఓకే సమయాన్ని. ఓకే స్టూడియోలో వీరిద్దరూ షూటింగ్ హాజరవడం విశేషంగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎంతో ప్రేమగా పలకరించుకున్నారు. ఈ మూమెంట్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంబంధించిన ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.
అయితే, సరిగ్గా 21 ఏళ్ల కింద కమల్ హాసన్, రజనీ ఓకే స్టూడియోలో కలిశారు. రజనీ ‘బాబా’, కమల్ ‘పంచతంత్ర’ చిత్రాలు చెన్నైలో ఓకే ప్లేస్ లో జరిగింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఆ గ్రేట్ మూమెంట్ వచ్చింది. అభిమానులు వారిద్దరినీ ఓకే ఫ్రేమ్ లో చూసి మురిసిపోతున్నారు. ఇక రీసెంట్ గా రజనీకాంత్ ‘జైలర్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అటు కమల్ ‘విక్రమ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంత చేసుకున్నారు.
Both & working for their projects in same studio after 21 years pic.twitter.com/u8jeqsS4Gi
— R a J i V (@RajivAluri)