#Devil డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?

Published : Dec 23, 2023, 07:02 PM IST
#Devil డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?

సారాంశం

 కళ్యాణ్ రామ్ చేస్తోన్న మరో వైవిధ్యమైన చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

 నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజైన నాటి నుంచి బిజినెస్ ఊపందుకుంది.  ‘బింబిసార’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తోన్న మరో వైవిధ్యమైన చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు, డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ చూద్దాం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ 
 
నైజాం  – Global Cinemas
సీడెడ్ – S Cinemas
వైజాగ్ – Sri Venkateshwara Films
కృష్ణా  — Alankar Prasad
ఈస్ట్ గోదావరి  — Suresh Movies
గుంటూరు— Padmavathi Films
బెంగుళూరు — Suresh Movies
ఒరిస్సా – Rajshri Films
నార్త్ ఇండియా — UFO Films
తమిళనాడు  — SSC Movies
ఓవర్ సీస్  — Phars Films Co.LLC
 
 అలాగే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ స్టేటస్ రావాలంటే 22 కోట్లకు పైగా రాబట్టాలి. ఆంధ్రా అన్ని  ఏరియాలు కలిపి  9 Cr,సీడెడ్  3.2 Cr.నైజాం  6Cr. మిగతా ప్రాంతాలు  3.5Cr+.ఓవరాల్ గా డెవిల్ చిత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.    

 రిలీజ్ డేట్ ఈ నెల 29 కావటంతో థియేటర్ రన్ కు సంక్రాంతి సినిమాలు అడ్డం వస్తాయి.  ఇక ఇప్పటికే కళ్యాణ్ రామ్ లుక్, సినిమా క్వాలిటీకి మంచి స్పందన వచ్చింది. అలాగే హీరోయిన్స్ సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లుక్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జానర్‌లో ఈ మూవీ ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డెవిల్’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా ‘డెవిల్’ విడుదల కాబోతోంది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఐదు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు.

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్కని ఒక ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌గా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించడానికి రెడీ అవుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..