కోట్లు వచ్చాయి.. అయితే ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ విభేదం

Published : Oct 02, 2017, 06:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
కోట్లు వచ్చాయి.. అయితే ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ విభేదం

సారాంశం

బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్న ఎన్టీఆర్ జైలవకుశ జై లవకుశ పై రివ్యూలు రాసిన క్రిటిక్స్ పై ఎన్టీఆర్ విమర్శలు ఎన్టీఆర్ విమర్శలను తప్పుబట్టిన అన్న కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే ఫస్ట్ డే నుంచి కొందరు క్రిటిక్స్ చేసిన విమర్శలతో హర్ట్ అయిన ఎన్టీఆర్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తగ్గిపోతాయనే టెన్షన్ తో.. కథ చెప్పాడు. ఆ కథలో క్రిటిక్స్ ను దారినపోయే దానయ్యలంటూ, ప్రేక్షకులు డాక్టర్లనీ.. సినిమా ఓ చావుబతుకులమధ్య పోరాడే పేషంట్ లాంటిదంటూ.. కథ చెప్పాడు. సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్ ఆవేశపూరితంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమయ్యాయి.

 

సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో రిలీజ్ కు ముందు మీడియా ఇచ్చిన ప్రోత్సాహం గురించి సన్నిహితులు ఎన్.టి.ఆర్ దగ్గర ప్రస్తావించారట. బిగ్ బాస్ టైంలో కూడా మీడియా ఎంతో సహకరించిందని.. ఒకరిని ఇద్దరిని టార్గెట్ చేయబోయి విషయం అందరిని హర్ట్ అయ్యేలా చేసిందని చెప్పారట.

 

దీని గురించి ఎన్.టి.ఆర్ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ ఆరోజు అలా మాట్లాడాల్సింది కాదని అనుకుంటున్నాడట. మొత్తానికి రివ్యూలపై తన అభిప్రాయాన్ని తెలిపిన తారక్ దాని వల్ల ఇంత హడావిడి అవుతుందని ఊహించి ఉండడు. అందుకే ఇక మీదట ఇలాంటి విషయాల మీద నోరు విప్పకూడదని అనుకుంటున్నాడట.

 

తారక్ అలా మాట్లాడతాడని జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ కు కూడా తెలియదట. “రివ్యూల మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయితే మీడియాను రివ్యూ రైటర్స్ ను దారినపోయే దానయ్యలు అనడం విషయాన్ని పక్కదోవ పట్టించింది. అక్కడ ఎన్.టి.ఆర్ కొంతమంది విశ్లేషకులు మాత్రమే అని స్పష్టంగా మెన్షన్ చేసినా మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు అసలు ఎన్టీఆర్ అలా మాట్లాడుతాడని తెలిస్తే తాను వారించేవాడినని” కళ్యాణ్ రామ్ సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారాల్లో తాను ఖచ్చితంగా విబేధిస్తానని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారట.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి