Devil: డైరెక్టర్‌ని పక్కన పెట్టిన `డెవిల్‌` నిర్మాత.. కళ్యాణ్‌ రామ్‌కి తెలిసే ఇదంతా జరుగుతుందా?

Published : Sep 12, 2023, 05:26 PM ISTUpdated : Sep 12, 2023, 05:29 PM IST
Devil: డైరెక్టర్‌ని పక్కన పెట్టిన `డెవిల్‌` నిర్మాత.. కళ్యాణ్‌ రామ్‌కి తెలిసే ఇదంతా జరుగుతుందా?

సారాంశం

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న `డెవిల్‌` సినిమాకి దర్శకుడు మారిపోయారు. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. కానీ ఇప్పుడే ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తున్నారట.

కళ్యాణ్‌ రామ్‌.. చాలా రోజుల తర్వాత `బింబిసార`తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన `అమిగోస్‌` మూవీ ఆ సక్సెస్‌ ఆనందాన్ని ఎన్ని రోజులు లేకుండా చేసింది. కళ్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు స్పై మూవీతో వస్తున్నారు కళ్యాణ్‌ రామ్‌. `డెవిల్‌` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. `ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌` అనేది ట్యాగ్‌లైన్‌. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లు, గ్లింప్స్, టీజర్లు ఆకట్టుకున్నాయి. సినిమాలో సమ్‌ థింగ్‌ ఏదో కొత్తగా ఉందనేలా అనిపించింది. అంచనాలు పెంచాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే చాలా రోజుగా ఈ చిత్రానికి సంబంధించి అప్‌ డేట్‌లు లేవు. సోమవారం హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ బర్త్ డే సందర్భంగా ఇందులోని ఆమె పాత్రని పరిచయం చేశారు. ఇందులో డెవిల్‌ ఏంజెల్‌ అంటూ సంయుక్త నటించే `నైషధ` పాత్రని పరిచయం చేశారు. ఇందులో సంయుక్త మీనన్‌ ఎంతో అందంగా, దేవకన్యలా కనిపిస్తుంది. 

అంతేకాదు టెంపుల్‌కి పూజకి వెళ్తున్నట్టుగా ఆమె లుక్‌ ఉంది. పట్టుచీర కట్టుకుని చేతిలో కొబ్బరికాయ, పూలు తీసుకుని వెళ్తున్నట్టుగా ఉన్న ఆమె లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. `బింబిసార` తర్వాత కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఒకింత పాజిటివ్‌ వైబ్స్ నెలకొన్నాయి. కానీ ప్రమోషనల్‌ పరంగానే టీమ్‌ వీక్‌గా ఉంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో కూడా రిలీజ్‌ చేయబోతున్నట్టు పోస్టర్‌లో పేర్కొన్నారు. నవంబర్‌ 24న సినిమా రిలీజ్‌ చేయబోతున్నారు. ఇందులో కళ్యాణ్‌ రామ్‌  బ్రిటీష్‌ స్పై ఏజెంట్‌గా కనిపిస్తారట. ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే పాత్రలో కనిపిస్తారని, ఆయన లుక్‌ కూడా ఆకట్టుకుంటుందని టీమ్‌ తెలిపింది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి దర్శకుడు మారిపోయారు. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. కానీ ఇప్పుడే ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తున్నారట. మొదట ఈ చిత్రానికి నవీన్‌ మేడారం దర్శకత్వం వహించారు. మొన్నటి వరకు ప్రెస్‌నోట్‌లో ఆయన పేరే ఉండింది. కానీ అనూహ్యంగా అతన్ని పక్కన పెట్టారట. దానికి కారణం నిర్మాతతో దర్శకుడికి మధ్య గొడవలే కారణమని తెలుస్తుంది. దర్శకుడికి, నిర్మాతకు మధ్య తలెత్తిన విభేదాల కారణంగా డైరెక్టర్‌ని అభిషేక్‌ నామా పక్కన పెట్టారట. అందులో భాగంగానే తన పేరుని తాజాగా దర్శకుడిగా ప్రకటించినట్టు తెలుస్తుంది. 

నిజానికి సినిమా ఔట్‌ పుట్‌ బాగా వచ్చిందట. దర్శకుడు బాగా చేశాడని, కానీ ఈ గొడవ నేపథ్యంలో డైరెక్టర్‌కి క్రెడిట్‌ ఇవ్వడం ఇష్టం లేక తన పేరునే దర్శకుడిగా వేసుకున్నారట నిర్మాత. తన అసిస్టెంట్ల సహకారంతో మిగిలిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారట. ఇదిప్పుడు టాలీవుడ్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే ఇదంతా హీరో కళ్యాణ్‌ రామ్‌కి తెలిసే జరుగుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఔట్‌పుట్‌ తేడా వస్తే అల్టీమేట్‌గా డ్యామేజ్‌ జరిగేది కళ్యాణ్‌ రామ్‌కే. ఆయన ఇమేజే డ్యామేజ్‌ అవుతుంది. నిర్మాతకి నష్టాలొస్తాయి. దర్శకుడు కొత్తవాడు కాబట్టి అతన్ని ఎవరూ పట్టించుకోరు. ఇందులో కళ్యాణ్‌ రామే ఫోకస్‌ అవుతాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో హీరో కేర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయనే ఇన్‌వాల్వ్ కావాల్సి ఉంటుంది. 

మరి దర్శకుడిని తీసేసి.. ఎలాంటి అనుభవం లేని నిర్మాత దర్శకుడిగా పేరేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. మరి తెరవెనుక ఏం జరుగుతుందనేది మాత్రం సస్పెన్స్. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే దర్శకుడిలో స్టఫ్‌ లేక పక్కన పెట్టారనే మరో వాదన కూడా ఉంది. మరోవైపు ఈ సినిమా ఇటీవల వచ్చిన నిఖిల్‌ `స్పై`, అలాగే ఓ పాపులర్‌ హిందీ సినిమాకి దగ్గరగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇదంతా సినిమాపై నెగటివ్‌ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అది బిజినెస్‌ పరంగానూ ఎఫెక్ట్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి  శ్రీకాంత్ విస్సా  మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. ఆయనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటున్నారని టాక్‌. ఇక చిత్ర దర్శకుడు నవీన్‌ మేడారం గతంలో `బాబు బాగా బిజీ` చిత్రాన్ని తీశారు. ఇది పెద్దగా ఆడలేదు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే