రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ

Published : Dec 14, 2017, 01:14 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ

సారాంశం

రవితేజ, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో మూవీ సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాంతో కల్యాణ్ కృష్ణకు హిట్స్ డిసెంబర్ చివరి వారం  ప్రారంభం కానున్న కొత్త చిత్రం షూటింగ్

రాజా ది గ్రేట్ చిత్రం సక్సెస్ తో మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రవితేజ.. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోందట. డిసెంబరు చివరి వారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్థుతం రవితేజ నటిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ చిత్రానికి విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హిరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు, కానీ విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 

కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా వచ్చిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. గత కొంత కాలంగా హిట్స్ ఇచ్చిన దర్శకుడికి సినిమా లేదా అనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో తాజాగా వచ్చిన రవితేజ,కల్యాణ్ కృష్ణ కాంబో మూవీ వార్త కల్యాణ్ కృష్ణ రేంజ్ ను నిరూపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే