మెగా అల్లుడి కోసం బాలీవుడ్ భామ!

Published : Jan 08, 2019, 05:05 PM ISTUpdated : Jan 08, 2019, 05:07 PM IST
మెగా అల్లుడి కోసం బాలీవుడ్ భామ!

సారాంశం

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మెగా సపోర్ట్ లేకుండానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అడుగులు వేస్తున్నాడు. అనుకుంటే స్టార్ దర్శకులతో స్టార్ హీరోయిన్స్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దారిలో నడుచుకోవడం లేదు. కొత్తగా వచ్చిన కుర్రాడిలా ఇప్పుడున్న స్థాయి ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 

ఇక మొదటి సినిమా విజేత కమర్షియల్ సక్సెస్ కాలేకపోయినా ఎదో నామమాత్రంగా ఆడేసింది. ఇక సెకండ్ సినిమాతో మరింతగా ఆడియెన్స్ ని మెప్పించాలని కష్టపడుతున్నాడు. ఇకపోతే ఈ సారి బాలీవుడ్ లో ఇప్పుడిపుడే అవకాశాలను అందుకుంటూ పడిలేస్తోన్న రియా చక్రబోర్తి కళ్యాణ్ తదుపరి సినిమాలో సెలెక్ట్ అయినట్లు సమాచారం. 

ఈ బ్యూటీ తెలుగులో తూనీగ తూనీగ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత బాలీవుడ్ లో  'హాఫ్ గర్ల్ ‘ఫ్రెండ్” - “బ్యాంక్ చోర్” - ‘జలేబి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా రోజుల తరువాత తెలుగులో మరో సినిమా చేయడానికి రియా సిద్ధమైంది. ఇక కళ్యాణ్ దేవ్ సెకండ్ ప్రాజెక్ట్ ను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తుండగా పులి వాసు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు