చిరు లీక్స్ స్ఫూర్తితో `కల్కి2898ఏడీ` లీక్‌.. క్రేజీగా మెగాస్టార్‌కి బర్త్ డే విషెస్‌..

Published : Aug 22, 2023, 07:01 PM IST
చిరు లీక్స్ స్ఫూర్తితో `కల్కి2898ఏడీ` లీక్‌.. క్రేజీగా మెగాస్టార్‌కి బర్త్ డే విషెస్‌..

సారాంశం

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `కల్కి2898ఏడీ` టీమ్‌ మాత్రం దీన్ని స్ఫూర్తిగా తీసుకుంది. `ప్రాజెక్ట్ కే` చిత్రం నుంచి ఓ లీకేజీని బయటపెట్టారు. అది కూడా చిరంజీవి బర్త్ డే సందర్భంగా కావడం విశేషం.

మెగాస్టార్‌ చిరంజీవి.. ఇటీవల కాలంతో తన సినిమాలకు సంబంధించిన లీక్‌ లిస్తూ చర్చనీయాంశం అవుతున్నారు. టీమ్‌ ఎవరికీ తెలియదంటూ చిన్న చిన్న వీడియో క్లిప్పులు, సాంగ్ క్లిప్పులు, డైలాగులు లీక్‌ చేస్తున్నారు. చాలా రోజులుగా ఆయన ఈ లీకేజీ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. మొదట అంతా నిజంగానే ఆయన లీక్‌ చేస్తున్నారని, అభిమానుల కోసం ఇదంతా చేస్తున్నారని అనుకున్నారు. కానీ తర్వాత ఇదంతా ప్రమోషనల్‌ స్టంట్‌ అని అందరికి అర్థమైపోయింది.

కానీ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `కల్కి2898ఏడీ` టీమ్‌ మాత్రం దీన్ని స్ఫూర్తిగా తీసుకుంది. `ప్రాజెక్ట్ కే` చిత్రం నుంచి ఓ లీకేజీని బయటపెట్టారు. అది కూడా చిరంజీవి బర్త్ డే సందర్భంగా కావడం విశేషం. మెగాస్టార్‌కి బర్త్ డే విషెస్‌ చెబుతూ, `ప్రాజెక్ట్ కే` సినిమా నుంచి చిన్న వీడియో క్లిప్‌ని విడుదల చేశారు. ఎడిటింగ్‌ రూమ్‌ నుంచి నేరుగా ఈ వీడియో క్లిప్‌ని విడుదల చేయడం విశేషం. ఇందులో ప్రభాస్‌ ఫైర్‌ వెలిగిస్తూ చిరంజీవికి బర్త్ డే విషెస్‌ చెప్పడం విశేషం. ప్రస్తుతం నిర్మాణ సంస్థ వైజయంతి దీన్ని తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. 

అయితే ఇందులో చిరు లీక్స్ స్ఫూర్తితో ఈ లీకేజీని విడుదల చేస్తున్నట్టు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. `కల్కి2898ఏడీ` ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో షూటింగ్‌ జరుగుతుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ నెగటివ్‌ రోల్‌ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనె, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో బిగ్‌ బీ అమితాబ్‌ కనిపించనున్నారు. 

ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. సంక్రాంతికి `కల్కి2898ఏడీ` విడుదల కాబోతుంది. సైన్స్ ఫిక్షన్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భవిష్యత్‌లో దాదాపు 875 ఏళ్ల తర్వాత విశ్వాన్ని ప్రతిబించించేలా ఉండబోతుంది. ఇతర ఏలియన్‌ జాతులు మనుషులను అణచివేయడం ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది.  ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నిర్మాత అశ్వనీదత్‌.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు