Kalki 2898 AD Postponeః ప్రభాస్‌ సినిమాపై ఎన్నికల దెబ్బ.. `కల్కి2898ఏడీ` మళ్లీ వాయిదా?

By Aithagoni Raju  |  First Published Mar 16, 2024, 6:55 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమాకి ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడబోతుందని తెలుస్తుంది. 
 


ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమా మే 9న రాబోతుందంటూ ఇప్పటి వరకు టీమ్‌ చెబుతూ వచ్చింది. పలు విధాలుగా కన్ఫమ్‌ చేసింది. కానీ సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ అయ్యే టైమ్ ని బట్టి సినిమా విడుదల ఉంటుదన్నారు. సాధ్యమైనంత వరకు మేలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. సాధ్యం కానీ టైమ్‌లో వాయిదా పడే అవకాశం ఉందనే టాక్‌ వినిపించింది. తరచూ ఈ సినిమా వాయిదాపై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. సినిమా వాయిదా పడే అవకాశం వందశాతం ఉంది. 

ఎందుకంటే తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. లోక్‌ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మన తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది `కల్కి` మూవీని వాయిదా వేసేందుకు కారణమవుతుంది. ఎందుకంటే ఈ మూవీని మే 9న రిలీజ్‌ అనుకున్నారు. అదే రోజు చాలా స్టేట్స్ లో లోక్‌ సభ ఎన్నికలు ఉంటాయి. అంతేకాదు మరో మూడు ఫేజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇది సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 

Latest Videos

ఎందుకంటే `కల్కి` పాన్‌ ఇండియా మూవీ. పాన్‌ ఇండియా మార్కెట్‌ చాలా ముఖ్యం. తెలంగాణ, ఏపీలు మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ, కేరళాలోనూ, అలాగే నార్త్ స్టేట్స్ లోనూ విడుదలవుతుంది. భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌నే టార్గెట్‌ చేశారు. అలాంటిది ఇండియాలో మార్కెట్‌ పై దెబ్బపడితే అది `కల్కి` కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఏపీ, తెలంగాణలోనూ మొదటి వారం తీవ్రమైన ప్రభావం ఉంటుంది. సినిమాని చూసే మూడ్‌లో ఆడియెన్స్ ఉండదు. అంతా ఎన్నికల హడావుడిలో ఉంటారు. అది సినిమాపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. 

ఈ నేపథ్యంలోనే `కల్కి2898ఏడీ` సినిమాని వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముందుగా ఏప్రిల్‌లోనే ఎన్నికలు అవుతాయని భావించారు. కానీ ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. దీంతో ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి` వందకి వెయ్యి శాతం వాయిదా పడే అవకాశమే ఉందని తెలుస్తుంది. టీమ్‌ లోనూ ఇదే చర్చ ప్రారంభమైందని తెలుస్తుంది. మరి టీమ్‌ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇదే నిజమైతే ఇది మూడోసారి వాయిదా పడటం అవుతుంది. ఇక ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు చాలా మంది హీరోలు, హీరోయిన్లు గెస్ట్ లుగా మెరవబోతున్నారు. అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 
 

click me!