విశ్వక్‌ సేన్‌ `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` రిలీజ్‌ డేట్‌.. భలే ప్లాన్‌ చేశారే!

Published : Mar 16, 2024, 06:15 PM IST
విశ్వక్‌ సేన్‌ `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` రిలీజ్‌ డేట్‌.. భలే ప్లాన్‌ చేశారే!

సారాంశం

మాస్‌ కా దాస్‌ ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ విషయంలో టీమ్‌ ప్లాన్‌ అదిరిపోయింది.   

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇటీవల `గామి` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇది పెద్దగా ఆడలేదు. ప్రయోగాత్మక చిత్రాలు జాబితాలో చేరింది. సిటీ ఆడియెన్స్ ని మాత్రమే ఆకట్టుకుంది. బి, సీ సెంటర్ల ఆడియెన్స్ కి రీచ్‌ కాలేకపోయింది. దీంతో అంతంత మాత్రంగానే మెప్పించింది. కానీ విజువల్‌గా వండర్‌గా, టెక్నీకల్‌గా ఈ మూవీ బ్రిలియెంట్‌గా ఉందని చెప్పొచ్చు. 

ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు విశ్వక్ సేన్‌. ఆయన ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ కొంత షూటింగ్‌ పార్ట్ పెండింగ్‌లో ఉండటంతో వాయిదా వేశారు. మళ్లీ మార్చిలో అనుకున్నారు. `గామి` మూవీ కోసం వాయిదా వేశారు. ఇప్పుడు ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ని ఇచ్చారు. మే 17న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే పక్కా ప్లాన్‌తోనే ఈ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఎందుకుంటే మే 13న తెలంగాణ, ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. జనాలు రిలాక్స్ అవుతారు. ఈ నేపథ్యంలో వినోదాన్ని కోరుకుంటారు. ఆ సమయంలోనే `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` రిలీజ్‌ కావడంతో అది ఈ మూవీకి హెల్ప్ కాబోతుందని చెప్పొచ్చు. చాలా వరకు సినిమాలు ఈ ఎన్నికల కోసం ఇంకా విడుదల తేదీలను ప్రకటించలేదు. ఈ మధ్యలో విడుదల చేస్తే సరైనా ఆదరణ దక్కదు. దీంతో ఎన్నికల తర్వాతే వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాయి. అయితే ఇందులో విశ్వక్‌ సేన్‌ టీమ్‌ ముందుగానే తేరుకోవడం విశేషం. 

ఇక విశ్వక్‌ సేన్‌ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. ఓ సాంగ్‌లోనూ ఆమె మెరవబోతుంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. షికర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ మాస్‌, రస్టిక్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..