
ఏ ఇండస్ట్రీలో అయినా హీరో హీరోయిన్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉండటం సహజమే. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు కానీ...మీడియాకు అలాంటివి ఏమీ ఉండవు. చట్టం దాని పని అది చేసుకుపోతుంది అన్నట్లు మీడియా తన పని తాను చేసుకుపోతూంటుంది. తనదైన శైలిలో రూమర్స్ క్రియేట్ చేసేస్తూంటుంది. అందులో కొంత నిజం..ఎంతో కల్పితం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే స్టార్ హీరోయిన్ కాజల్ కు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు లింక్ పెడుతూ మీడియాలో వస్తున్న వార్తలను గమనించి.
చిన్న హీరోల నుంచి చిరంజీవి వరకు అందరితో నటించేసిన కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాల్లో చేసింది. అందులో మొదటి చిత్రం కవచం రీసెంట్ గా రోజు రిలీజ్ కాగా.... మరో చిత్రం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదట. ఇదే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపీక్ గా మారింది. మీడియాకు మంచి ఫుడ్ గా మారింది. సడన్ గా శ్రీనివాస్... కాజల్ కి ఆఫర్స్ మిద ఆఫర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి?.అంటూ రచ్చ రచ్చ చేసేస్తోంది.
బెలంకొండ శ్రీనివాస్ , కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కవచం సినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. దీంతోపాటు తేజ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇప్పడీ రెండు సినిమాలతో పాటు కాజల్-బెల్లంకొండ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది."సాయి శ్రీనివాస్ తో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. అతడితో వర్క్ చేయడం అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను, సాయిశ్రీనివాస్ ఒకేలా ఆలోచిస్తాం.
మా ఇద్దరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అంటూ కొత్త విషయాలు చెప్పుకొచ్చింది. నిజానికి కవచం చిత్రంలో కాజల్ పేరుని శ్రీనివాస్ సిఫార్సు చేయగా, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాకపోయినా కాజల్ చేసేసిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆమధ్య కాజల్‌ని తన భుజాలపై ఎక్కించుకుని శ్రీనివాస్ దిగిన ఫోటో వైరల్ అయింది. తాజాగా వీరిద్దరి స్టేట్‌మెంట్స్‌తో ఈ రిలేషన్ గాసిప్ సర్కిల్స్‌ని యమగా ఆకర్షిస్తోంది.ఈ ఇద్దరి మధ్య ఇంటర్నల్ గా ఎదో జరుగుతుంది అనే టాక్ ఫిల్మ్ నగర్ లో గట్టిగా స్ప్రెడ్ అవటానికి అదే కారణం.