ప్రియుడి కళాత్మక హృదయంపై కాజల్‌ ప్రశంసలు..ఫోటో హల్‌చల్‌

Published : Oct 14, 2020, 04:14 PM IST
ప్రియుడి కళాత్మక హృదయంపై కాజల్‌ ప్రశంసలు..ఫోటో హల్‌చల్‌

సారాంశం

తాజాగా గౌతమ్‌.. కాజల్‌తో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌వైట్‌లో ఉన్న ఫోటోని ఎంగేజ్‌మెంట్‌ డెకరేషన్‌లో వేలాడదీశారు. దాని వెనకాల బెలూన్స్ ఉన్నాయి. 

కాజల్‌ ఇప్పుడు ప్రియుడి ప్రేమలో మునిగి తేలుతుంది. పెళ్ళికి ముందు ఆయన ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ముంబయికి చెందిన ఇంటీరియర్‌ డిజైన్‌కి చెందిన కంపెనీ అధినేత గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. 

ఇటీవల ఈ విషయాన్ని కాజల్‌ ప్రకటించింది. ఈ నెల 30న ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌గా ఈ మ్యారేజ్‌ జరగబోతుందని తెలిపింది. అయితే తాజాగా గౌతమ్‌.. కాజల్‌తో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌వైట్‌లో ఉన్న ఫోటోని ఎంగేజ్‌మెంట్‌ డెకరేషన్‌లో వేలాడదీశారు. దాని వెనకాల బెలూన్స్ ఉన్నాయి. 

అయితే ఈ ఫోటోలో గౌతమ్‌ కిచ్లుతో కంటే దాని వెనకాల ఉన్న డిజైన్‌ కాజల్‌కి బాగా నచ్చిందట. డిజైన్‌పై కాజల్‌ ప్రశంసలు కురిపించింది. `ఇది కూడా డిజైన్‌ అంశాన్ని ప్రతిబింబిస్తోందని, కళాత్మక హృదయం కలిగిన నా ఫియాన్సీ` అని కామెంట్‌ చేసింది. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన
Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ