
చిరు 150వ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన గుజరాతీ గుడియా కాజల్ ఇప్పుడు మెగాస్టార్ సరసన షూటింగ్ లన్నీ పూర్తి చేసుకుని జాలీగా ఉంది. ఈ ముంబై బ్యూటీ ఇప్పుడు మెగా స్టార్ పై మనసు పారేసుకుంది. చిరంజీవి అందం నాలుగురెట్లు పెరిగిందంటోంది. మెగాస్టార్ పై పొగడ్తల వర్షం కురిపించింది.
'మెగాస్టార్ తన స్థాయిని పక్కన పెట్టి సెట్లో అందరితో సరదాగా ఉండే వారు, నేను సెట్ లో కంఫర్టబుల్ గా ఉండేలా సహకరించారు. గతంలో ఏ హీరోతో కూడా ఇంత సరదాగా గడపలేదు. సెట్లో ఉన్న వారందరితో మెగాస్టార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నిజంగా ఓ గొప్ప డ్యాన్సర్' అంటూ కాజల్ మెగాస్టార్ ని పొగడ్తలతో ముంచేస్తోంది.
కాజల్ కు డ్యాన్స్ చేసేటప్పుడు మెగాస్టార్ కొన్ని సలహాలు కూడా ఇచ్చారట. వాటి ద్వారా తన డ్యాన్స్ లో మార్పు కూడా వచ్చిందని చెప్తోంది. ఆ మార్పును సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడొచ్చంటోంది. ఇంత కాలం చిరు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్తోంది. మెగాస్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, అయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో ప్రత్యేకం అని కాజల్ తెగ మురిసిపోతోంది.