దర్శకుడు తేజతో మరోసారి..?

Published : Jun 17, 2019, 12:57 PM IST
దర్శకుడు తేజతో మరోసారి..?

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ కాలం గడుపుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ కాలం గడుపుతోంది. ఈమెకు సౌత్ లో చెప్పుకోదగ్గ ఆఫర్లు రావడం లేదు. ఇటీవల తేజ దర్శకత్వంలో 'సీత' సినిమాలో నటించింది.

ఆ సినిమా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఎంతగానో నమ్మి చేసిన ప్రాజెక్ట్ దెబ్బ కొట్టడంతో ఆలోచనలో పడింది కాజల్. అయితే దర్శకుడు తేజ.. కాజల్ కోసం మరో కథను రాసుకున్నాడట.మహిళా ప్రాధాన్యం ఉన్న స్క్రిప్ట్ కావడంతో కాజల్ మరోసారి తేజతో కలిసి పని చేయాలనుకుంటోంది.

అంతేకాదు.. ఈ సినిమాతో కాజల్ నిర్మాతగా మరో జర్నీ మొదలుపెట్టనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ వాళ్లకు నచ్చే విధంగా కథను సిద్ధం చేస్తున్నారని 
టాక్.

కాజల్ గనుక ఓకే చెబితే.. తేజతో ఆమె చేసే నాలుగో సినిమా అవుతుంది. గతంలో తేజ రూపొందించిన 'లక్ష్మీ కళ్యాణం', 'నేనే రాజు నేనే మంత్రి', 'సీత' వంటి చిత్రాల్లో నటించింది కాజల్.   

PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు