వరంగల్ లో కాజల్ భర్తకు స్వీట్ షాక్.. ఆమె క్రేజ్ చూసి..

pratap reddy   | Asianet News
Published : Aug 13, 2021, 09:00 PM IST
వరంగల్ లో కాజల్ భర్తకు స్వీట్ షాక్.. ఆమె క్రేజ్ చూసి..

సారాంశం

గత ఏడాది కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మ్యారేజ్ లైఫ్ ని, కెరీర్ ని బ్యాలన్స్ చేస్తోంది. 

చందమామ కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగార్జున, ప్రవీణ్ సత్తారు చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. 

గత ఏడాది కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మ్యారేజ్ లైఫ్ ని, కెరీర్ ని బ్యాలన్స్ చేస్తోంది. కాజల్ ప్రచార కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. 

ఆమెకున్న క్రేజ్ తో తమ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కాజల్ ని ఆహ్వానిస్తుంటారు యాజమాన్యాలు. శుక్రవారం కాజల్ అగర్వాల్ వరంగల్ లో పర్యటించింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఆమె వరంగల్ కు వెళ్ళింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే కాజల్ తో పాటు ఆమె భర్త కూడా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరయ్యాడు. 

నార్త్ లో కాజల్ కు పెద్దగా క్రేజ్ లేదు. కానీ టాలీవుడ్ లో కాజల్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కోనసాగుతోంది. దీనితో కాజల్ ని చూసేందుకు షాపింగ్ మాల్ బయట వేలాదిమంది జనం గుమిగూడారు. 

కాజల్ కనిపించగానే కేరింతలు మోత మోగాయి. ఇందంతా గమనించిన కాజల్ భర్త గౌతమ్ స్వీట్ షాక్ కి గురయ్యాడు. తన సతీమణికి తెలుగు రాష్ట్రాల్లో ఇంత పాపులారిటీ ఉందని బహుశా గౌతమ్ కి ఈ సంఘటన ద్వారా తెలిసిఉంటుంది. కాజల్, గౌతమ్ వరంగల్ పర్యటన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు