Latest Videos

క్యారవాన్ లోకి దూరి అసిస్టెంట్ డైరెక్టర్ పిచ్చి ప్రవర్తన.. కాజల్ కి షాక్, ఎలా వార్నింగ్ ఇచ్చిందంటే.. 

By tirumala ANFirst Published May 24, 2024, 11:49 AM IST
Highlights

కాజల్ అగర్వాల్ త్వరలో సత్యభామ చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ సోలో హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

కాజల్ అగర్వాల్ త్వరలో సత్యభామ చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ సోలో హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వివాహం తర్వాత భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. త్వరలో శంకర్ దర్శకత్వంలోని ఇండియన్ 2 కూడా రిలీజ్ అవుతోంది. 

సత్యభామ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కాజల్ తనకు ఎదురైనా షాకింగ్ సంఘటనని రివీల్ చేసింది. ఇటీవల నేను వర్క్ చేసిన ఓ చిత్ర షూటింగ్ సమయంలో ఈ  సంఘటన ఎదురైనట్లు కాజల్ పేర్కొంది. 

ఆ చిత్రానికి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సడెన్ గా కేరవాన్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చేశాడు. అంతటితో ఆగకుండా షర్ట్ విప్పేశాడు. నేను ఒక్కసారిగా భయపడిపోయాను. తన బాడీపై న పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లు చూపించాడు. నేను మీ అభిమానిని మేడమ్ అని చెప్పాడు. 

అతడి పిచ్చి ప్రవర్తన నాకు ఆశ్చర్యం కలిగించింది. అభిమానం చూపించడం ఒకే. కానీ ఇది పద్ధతి కాదు. ఇలా అనుమతి లేకుండా కేరవాన్ లోకి రావడం తప్పు. ఇంకెప్పుడూ ఇలా చేయకు అని అతడికి వార్నింగ్ ఇచ్చినట్లు కాజల్ పేర్కొంది. 

click me!