నిర్మాతల ఫేవరైట్ హీరో శర్వానంద్ సరసన చేయదట

Published : Nov 01, 2017, 02:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
నిర్మాతల ఫేవరైట్ హీరో శర్వానంద్ సరసన చేయదట

సారాంశం

తెలుగులో టాప్ హిరోయిన్ రేసులో వున్న కాజల్ అగర్వాల్ దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో తళుకులీనుకున్న కాజల్ శర్వానంద్ సరసన ఆఫర్ ఇస్తే నటించనన్న టాలీవుడ్ చాందినీ

తెలుగు సినీపరిశ్రమలో అందాల చందమామ కాజల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మెగాస్టార్ సరసన నటించి.. నిన్నటి రాధ క్యారక్టర్ వరకు కాజల్ టాప్ రేసులో నిలిచేలా పాత్రల్లో నటించింది. అయితే ఈ ప్రౌఢ సుందరిగా మారుతుందనుకుంటున్న బ్యూటీ ఓ యంగ్ హీరోకే ఝలక్ ఇచ్చింది. 

 

వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న శర్వానంద్ మినిమమ్ గ్యారంటీ స్థాయినుండి టాప్ హీరోలతో పోటీ పడే స్థాయికి ఎదిగాడు. గత సంక్రాంతి సీజన్‌లో సీనియర్ హీరోలు చిరు, బాలయ్యలో పోటీ పడి మరీ శతమానం భవతి మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో తాజాగా మహానుభావుడు మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్న శర్వానంద్ నిర్మాతల హీరోగా మారడంతో ఈయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు.

 

తాజాగా శర్వానంద్.. సుధీర్ వర్మ డైరక్షన్‌లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ యంగ్ హీరోగానే కనిపించిన శర్వానంద్ ఈ సినిమాలో వినూత్నంగా డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో ఒకటి లవర్ బాయ్ పాత్ర కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. ఆ మధ్య వయస్కుడి క్యారెక్టర్‌కు జోడీగా నటించాలని కాజల్ ను సంప్రదిస్తే.. సింపుల్‌గా నో చెప్పేసిందట. కావాలంటే రెమ్యూనరేషన్ కూడా బాగానే ముట్టచెప్తామన్నా ససేమిరా అందట. దీంతో కాజల్ ప్లేస్‌ను మిల్కీ బ్యూటీ తమన్నాతో రీప్లేస్ చేశారట మేకర్స్.

 

ఇదిలా వుంటే శర్వానంద్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం ఏంటని, అతడి వరుస హిట్‌లు కాజల్‌కు కనిపించడం లేదా అంటూ శర్వా అభిమానులు గుస్సా చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి