Ramayana Movie: యశ్ 'రామాయణ'లో కాజల్‌కు షాక్? ఎడిటింగ్‌లో ఆమె రోల్ లేపేశారా?

Published : Oct 24, 2026, 06:53 PM IST
Kajal Aggarwal

సారాంశం

రణబీర్ కపూర్, యశ్ నటిస్తున్న 'రామాయణ' సినిమాలో కాజల్ అగర్వాల్ మండోదరిగా కనిపించనుందా? ఎడిటింగ్‌లో ఆమె పాత్రను లేపేశారా అనే అనుమానాలు ఇప్పుడు అభిమానులలో ఆసక్తి రేపుతున్నాయి.

బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'రామాయణ' రోజూ ఏదో ఒక వార్తతో ట్రెండ్ అవుతోంది. నితీష్ తివారీ డైరెక్షన్‌లో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అయితే, ఈ సినిమాలో మండోదరిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుందని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పుడు ఆమె పాత్రపై కొత్త చర్చ మొదలైంది. నిజంగానే కాజల్ రోల్‌కు కత్తెర పడిందా? లేక చిత్రయూనిట్ కావాలనే సీక్రెట్‌గా ఉంచిందా?

'రామాయణ'లో కాజల్ అగర్వాల్ నటిస్తోందా?

రామాయణ ఇతిహాసం ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రావణుడి భార్య మండోదరి పాత్రకు కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ వినిఅభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. మండోదరిగా కాజల్ ఎలా ఉంటుందో అని తెగ చర్చించుకున్నారు. కానీ, రీసెంట్‌గా వచ్చిన పోస్టర్లు, టీజర్, ప్రమోషన్లలో ఎక్కడా కాజల్ కనిపించలేదు. మిగతా నటీనటుల గురించి మాట్లాడుకుంటున్నా, కాజల్ పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అసలు ఆమె ఈ సినిమాలో ఉందా లేదా అనే డౌట్స్ మొదలయ్యాయి.

ఎడిటింగ్‌లో కాజల్ రోల్ లేపేశారా?

కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన సీన్లను సినిమా నుంచి తీసేశారనే రూమర్స్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే నిజమని నమ్మలేం. రామాయణ కథలో మండోదరి పాత్ర చాలా కీలకం. కానీ, స్క్రీన్‌ప్లే ఎలా రాసుకున్నారు, ఏయే ఘట్టాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేదానిపై ఆ పాత్ర నిడివి ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే, ఫస్ట్ పార్ట్‌లో మండోదరి పాత్రకు పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చనే టాక్ కూడా నడుస్తోంది.

సెకండ్ పార్ట్‌లో ఇంపార్టెన్స్ ఉంటుందా?

'రామాయణ' రెండు భాగాలుగా రాబోతోంది. కాబట్టి, కాజల్ పాత్ర ఫస్ట్ పార్ట్‌లో తక్కువే ఉన్నా, సెకండ్ పార్ట్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే మూవీ టీమ్ కావాలనే ఆమె పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందా అనే ఆసక్తి కూడా నెలకొంది. అయితే, కాజల్ పాత్ర నిజంగా ఎలా ఉండబోతోంది, ఫస్ట్ పార్ట్‌లో కనిపిస్తుందా లేక సెకండ్ పార్ట్‌లో మెయిన్ రోల్ ప్లే చేస్తుందా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

కాజల్అభిమానులకు సర్ప్రైజ్ ఉందా?

ఒకవైపు రణబీర్ కపూర్ రాముడి గెటప్‌పై అంచనాలు పెరిగిపోతుంటే, మరోవైపు కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రపై వస్తున్న రూమర్స్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. నిజంగానే ఆమె సీన్లను తీసేశారా, లేక మూవీ టీమ్ కావాలనే సైలెంట్‌గా ఉందా అనేది అఫీషియల్ న్యూస్ వస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికి కాజల్ రోల్‌కు కత్తెర పడిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కాబట్టి, ఈ విషయంపై అభిమానులు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Aadi Rudra: ఆది సాయికుమార్ కొత్త సినిమా 'ఆది రుద్ర' కథేంటి? ఉత్కంఠ రేపే అంశాలు ఇవే
Sudhakar: కోమాలోకి వెళ్లి వచ్చిన నటుడు, వెంకటేష్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరిక.. ఆ కమెడియన్ల లాగా అంత ఆశ లేదు