Indian 2: ఇండియన్ 2 షూటింగ్ అప్డేట్.. కాజల్ ఫ్యాన్స్ కి పండగే, స్వయంగా ప్రకటించిన చందమామ

Published : Aug 05, 2022, 09:31 AM IST
Indian 2: ఇండియన్ 2 షూటింగ్ అప్డేట్.. కాజల్ ఫ్యాన్స్ కి పండగే, స్వయంగా ప్రకటించిన చందమామ

సారాంశం

అగ్ర దర్శకుడు శంకర్ కి, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాతలకు తలెత్తిన విభేదాల కారణంగా 'ఇండియన్ 2' చిత్రం మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆగిపోయిన ఇండియన్ 2 చిత్రాన్ని తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారు.

అగ్ర దర్శకుడు శంకర్ కి, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాతలకు తలెత్తిన విభేదాల కారణంగా 'ఇండియన్ 2' చిత్రం మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' చిత్రంతో తమిళ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అదే జోష్ లో మరో పెద్ద చిత్రం చేయాలని కమల్ భావిస్తున్నాడు. 

ఆగిపోయిన ఇండియన్ 2 చిత్రాన్ని తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యేందుకు అంతా సిద్ధం అయింది. సెప్టెంబర్ నుంచి ఇండియన్ 2 షూటింగ్ షురూ కానున్నట్లు అఫీషియల్ గా తెలిసింది. ఈ అద్భుతమైన వార్త ప్రకటించింది ఎవరో కాదు.. చందమామ కాజల్ అగర్వాల్. 

ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోవడం.. ఆ తర్వాత కాజల్ ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయింది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్ లో ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వినిపించాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ లో కాజల్ అగర్వాల్ అనుమానాల్ని పటాపంచలు చేసింది. 

ఇండియన్ 2 షూటింగ్ సెప్టెంబర్  నుంచి షురూ కానుందని  కాజల్ అగర్వాల్ పేర్కొంది. దీనితో ప్రెగ్నెన్సీ తర్వాత చందమామ రీ ఎంట్రీ కంఫర్మ్ అయింది. విక్రమ్ తర్వాత కమల్ నటిస్తున్న చిత్రం కావడం.. దాదాపు 25 ఏళ్ల తర్వాత శంకర్ దర్శకత్వంలో నటిస్తుండడంతో ఇండియన్ 2 పై అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశం ఉంది. 

మరోవైపు శంకర్ రాంచరణ్ తో RC15(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలని శంకర్ ఒకేసారి షూట్ చేస్తారేమో చూడాలి. మరోవైపు ఇండియన్ 2.. 2023 సంక్రాంతికే రిలీజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?