కమల్ కు కాజల్ కరక్ట్ టైమ్ చూసి ట్విస్ట్

Siva Kodati |  
Published : Jun 02, 2019, 04:53 PM IST
కమల్ కు కాజల్ కరక్ట్ టైమ్ చూసి ట్విస్ట్

సారాంశం

లోక నాయకుడు కమల్‌ హాసన్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

లోక నాయకుడు కమల్‌ హాసన్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

 అయితే బడ్జెట్ కంట్రోలు, మేకప్ సమస్యలు, కమల్ రాజకీయ ప్రవేశం వంటి రకరకాల కారణాలతో ప్రాజెక్టు వాయిదా పడింది.  అయితే ఇప్పుడు సెట్ అయ్యి..సెట్ మీదకు వెళ్లే సమయం దగ్గరపడింది. అయితే ఈ సమయంలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ ట్విస్ట్ ఇచ్చిందని సమాచారం.  తెలుగులో చిరంజీవి లాంటి సీనియర్ల సరసన నటించిన కాజల్‌, కమల్‌ సరసన నటించే అవకాశం రావటంతో వెంటనే ఓకె చెప్పింది. 

కానీ ఆ సినిమా కోసం కేటాయించిన డేట్స్ వాడుకోకపోవటం, వేరే ప్రాజెక్టులు ఆమె కమిటై ఉండటంతో టీమ్ కు తాను మళ్లీ డేట్స్ కేటాయించలేనని చెప్పిందిట. అయితే ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్ విషయంలో మాత్రం డేట్స్ వాడుకోకోపోవటం తమ తప్పే కాబట్టి ..వెనక్కి అడగకూడదని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది . ఇక ఇప్పుడు కాజల్ ప్లేస్ లోకి నయనతారని తీసుకుంటున్నారట.  త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన