బన్నీ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్!

Published : Jun 10, 2019, 02:46 PM IST
బన్నీ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథల్లో కూడా నటిస్తోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథల్లో కూడా నటిస్తోంది. గతంలో ఈ బ్యూటీ 'జనతా గ్యారేజ్' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది.

'పక్కా లోకల్' అంటూ ఆమె వేసిన స్టెప్పులను అంత సులువుగా మర్చిపోలేం. ఎన్టీఆర్ తన స్నేహితుడు కావడంతో కాజల్ ఐటెం సాంగ్ కి ఒప్పుకుంది. ఆ తరువాత మరే స్పెషల్ సాంగ్ లో కనిపించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించడానికి సిద్ధమవుతుందని టాక్.

బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ లు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ ని సంప్రదించినట్లు సమాచారం.

అయితే ఆమె అంగీకరించిందా..? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సివుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి