తేజ దెబ్బకి నా నడుం విరిగింది.. కాజల్ కామెంట్స్!

Published : May 20, 2019, 03:57 PM IST
తేజ దెబ్బకి నా నడుం విరిగింది.. కాజల్ కామెంట్స్!

సారాంశం

దర్శకుడు తేజ తనకు కావాల్సిన అవుట్ పుట్ కోసం నటీనటులను చాలా ఇబ్బంది పెడతాడని, కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇప్పుడు కాజల్ కూడా ఈ లిస్ట్ లోకి చేరింది

దర్శకుడు తేజ తనకు కావాల్సిన అవుట్ పుట్ కోసం నటీనటులను చాలా ఇబ్బంది పెడతాడని, కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇప్పుడు కాజల్ కూడా ఈ లిస్ట్ లోకి చేరింది. 'సీత' సినిమా సమయంలో తేజ తన నడుము విరగ్గొట్టేశాడని చెబుతోంది.

''తేజ మన పెర్ఫార్మన్స్ చూడడు.. మన కళ్లు చూస్తాడు.. అందులో పెర్ఫార్మన్స్ కనిపించాలంటాడు. ఏదైనా చేయండి నాకు మాత్రం కళ్లలో హావభావాలు కనిపించాలంటాడు. చాలా అలసిపోయాను.. ఫిజియో థెరపీ కూడా చేయించుకున్నాను. ఒక దశలో నా కాళ్లపై నేను నిలబడలేకపోయాను. నా నడుము భాగానికి వేసిన ప్లాస్టర్ లతోనే నేను నటించాను.. సినిమాలో కూడా ఆ సన్నివేశాలు కనిపిస్తాయి. మరి అవి ఉంచారో, ఎడిట్ చేశారో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చింది.

ఈ సినిమా అన్నీ భరించానని, తనకు ఆ పాత్ర అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా.. కేఏ వెంచర్స్ బ్యానర్ పెట్టి సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్లుగా చెప్పింది. అయితే దానికి ఇంకా చాలా సమయం పడుతుందని, బ్యానర్ కి మాత్రం కేఏ వెంచర్స్ అనే పేరు పెట్టడం ఖయమంటుంది.   

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?