లిరిసిస్ట్ చంద్రబోస్ కుటుంబంలో విషాదం!

Siva Kodati |  
Published : May 20, 2019, 03:46 PM ISTUpdated : May 20, 2019, 08:16 PM IST
లిరిసిస్ట్ చంద్రబోస్ కుటుంబంలో విషాదం!

సారాంశం

సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రబోస్ తల్లి మదనమ్మ సోమవారం మృతి చెందారు. 

సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రబోస్ తల్లి మదనమ్మ సోమవారం మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. దీనితో సినీ ప్రముఖులంతా చంద్రబోస్ కు తల్లి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

వారి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని చల్లగరిగలో చంద్రబోస్ తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. మదనమ్మకు మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో చివరి వాడు చంద్రబోస్. చంద్రబోస్ తన అద్భుతమైన సాహిత్యంతో తెలుగు సినీ ప్రియులని అలరిస్తున్నాడు. స్టార్ లిరిసిస్ట్ గా టాలీవుడ్ లో ఎదిగారు. 

గత ఏడాది చంద్రబోస్ సింగిల్ కార్డులో రంగస్థలం చిత్రానికి అందించిన పాటలు అందరిని అలరించాయి. సుకుమార్, చంద్రబోస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..