కెఎ.పాల్ బయోపిక్.. టైటిల్ రెడీ!

By Prashanth MFirst Published 23, Feb 2019, 10:21 AM IST
Highlights

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బయోపిక్ లతో ప్రచారాలు బాగానే సాగుతున్నాయి. అయితే జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కెఏ.పాల్ కి సంబందించిన మరో సంచలన వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో బిజీ బిజీగా తిరిగిన పాల్ పై ఎప్పుడూ ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తుందో అందరికి తెలిసిందే. 

అయితే పాల్ తన బయోపిక్ ను ఎవరైనా తెరకెక్కించవచ్చని కాకపోతే వారికి మూడు నెలల టైమ్ మాత్రమే ఇస్తానని బయోపిక్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తితో బాండ్ స్క్రిప్ట్ రెడీ చేయించినట్లు చెప్పిన పాల్ బయోపిక్ తీస్తే పెట్టాల్సిన టైటిల్ పై కూడా ముందే క్లారిటీ ఇచ్చారు. 

ఇక సాంగ్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టినట్లు చెబుతూ విశ్వవిజేత అని యూ ట్యూబ్ లో అల్ రెడీ రిలీజ్ చేసినట్లు చెప్పారు. ద మోడర్న్ డే గాంధీ.. వరల్డ్ మోస్ట్ పాపులర్.. 8th వండర్ ఆఫ్ ది వరల్డ్.. ఇలా రకరకాల టైటిల్స్ గురించి వివరణ ఇచ్చిన పాల్ ఎక్కువగా మోడర్న్ డే గాంధీ అనే టైటిల్ బావుంటుందని అన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు అందరూ తనను గాంధీ సుభాష్ చంద్రబోస్ లతో పిలుస్తున్నారని ఆ విధంగా నన్ను చూడటం భావ్యం కాదని పాల్ క్లారిటీ ఇచ్చారు. 

Last Updated 23, Feb 2019, 10:21 AM IST