KGF 2: ఇక ‘కేజీఎఫ్ చాప్ట‌ర్-2’ ఫ్రీగా చూడొచ్చు! ఎప్పటినుంచంటే...

Surya Prakash   | Asianet News
Published : Jun 01, 2022, 06:38 AM IST
KGF 2: ఇక ‘కేజీఎఫ్ చాప్ట‌ర్-2’ ఫ్రీగా చూడొచ్చు! ఎప్పటినుంచంటే...

సారాంశం

ఇప్పుడు కేజీఎఫ్ చిత్రానికి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ద‌తిని తొలిగించ‌నుండటంతో అందరూ హ్యాపీగా చూడగలగుతారు. జూన్ 3నుంచి అమేజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్‌లు కేజీఎఫ్-2 చిత్రాన్ని ఉచితంగా చూసే వెసులు బాటును అమేజాన్ సంస్థ క‌ల్పించ‌నుంది. 

శాండల్ వుడ్ పేరు అందరి నోట్లో నానేలా చేసిన సినిమా 'కే జి ఎఫ్: చాప్టర్ 1'. కన్నడ సినిమాలకు క్రేజ్ పెరిగింది ఈ సినిమా సక్సెస్ తర్వాత అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా రీసెంట్ గా 'కే జి ఎఫ్: చాప్టర్ 2' అనే సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలుకు తగ్గట్లుగా భారీగా సక్సెసైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించడంతో ఈ సినిమా హిందీలోనూ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతుందా అని అబిమానులు ఎదురుచూస్తున్నారు. 

 
ఈ మూవీ  మార్చి 16నుంచి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ధ‌తిలో  అమెజాన్ ప్రైమ్ వీడియాలోకి అందుబాటులోకి వచ్చింది.  స‌బ్‌స్క్రైబ‌ర్లు అద‌నంగా రూ.199 పెట్టి సినిమా చూడాలనేది కండీషన్. ఈ విషయమై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. చాలా మంది వన్ ఇయర్ సబ్స్ స్క్రిప్షన్ రూ. 1499 పే చేసినా అదనంగా రూ. 199 ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించారు.  అలాగే  అమెజాన్ ప్రైమ్ కు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా దిమ్మదిరిగే కామెంట్స్ చేయటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. పే పర్ వ్యూ విధానంలో కాకుండా సినిమాని వివిధ ప్లాట్ ఫామ్ లలో డౌన్ లోడ్ హె చ్ డీ ప్రింట్ లింక్స్ లభిస్తుండటంతో ఇల్లీగల్ గా ఈ మూవీని డౌన్ లోడ్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా అకౌంట్ కు లింగ్ చేస్తూ ట్వీట్ చేసారు.

 

అయితే  ఇప్పుడు కేజీఎఫ్ చిత్రానికి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ద‌తిని తొలిగించ‌నుండటంతో అందరూ హ్యాపీగా చూడగలగుతారు. జూన్ 3నుంచి అమేజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్‌లు కేజీఎఫ్-2 చిత్రాన్ని ఉచితంగా చూసే వెసులు బాటును అమేజాన్ సంస్థ క‌ల్పించ‌నుంది.తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి కనిపించబోతుంది. ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. ఆ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని ఈ  ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే