
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయం పెద్ద రచ్చ అవుతోంది. ఇప్పుడు అలాగే ప్రబాస్ తనకు ఇష్టమైన హీరో అన్నారని రచ్చ జరుగుతోంది. అసలు ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. అయితే మామూలు జనం సంగతి వేరు. ఓ స్టార్ హీరో అదే మాటని చెప్పటం వేరు. ఆ హీరో మరెవరో కాదు రణ్‌బీర్ కపూర్. తన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం రివీల్ చేసారు. టాలీవుడ్ లో తనకెందరో హీరోలు ఫ్రెండ్స్ గా ఉన్నా.. ప్రభాస్ అంటే మాత్రం తనకు బాగా ఇష్టం అన్నారు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. దాంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులను ఛిల్ చేయటానికే ఈ మాటలు అన్నారా అని కొందరు కౌంటర్స్ వేస్తున్నారు. కొందరైతే ఈ విషయమై అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ రచ్చ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
రణబీర్ కపూర్ తన కొత్త సినిమా 'బ్రహ్మాస్త్ర' మొదటి భాగం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటించడంతో.. ఇక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా చిన్న పాటి గ్లింప్స్ వదిలి అందరిలోనూ ఎక్సపెక్టేషన్స్ పెంచేశారు. జూన్ 15న ట్రైలర్ రాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీమ్ ఇప్పుడు వైజాగ్‌లో సందడి చేసింది. మెలోడీ థియేటర్ లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ లో రణబీర్ కపూర్ తో పాటు సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ , రాజమౌళి పాల్గొన్నారు. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తోన్నారు.
రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ... తనకు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని, సౌత్ సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని, రాజమౌళి మా అందరికీ మార్గదర్శకుడని చెప్పుకొచ్చాడు. దక్షిణాది సినిమాలని చెబుతూ రజినీ సర్, కమల్ సర్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్, రామ్ చరణ్ నాకు మంచి ఫ్రెండ్స్ అని ఇలా టాలీవుడ్ హీరోలందరినీ గుర్తు చేసుకున్నాడు.
ఇక తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరంటే మాత్రం డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పేశాడు. అందరూ గొప్ప నటులే అయినా నన్ను ఏ ఒక్కరినో సెలెక్ట్ చేయమంటే మాత్రం డార్లింగ్ ప్రభాస్‌ను ఎంచుకుంటాను.. నాకు చాలా మంచి మిత్రుడు అని రణ్‌బీర్ కపూర్ చెప్పారు.
బ్రహ్మాస్త సినిమా ట్రైలర్ జూన్ 15 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇక రణబీర్ కపూర్ ను స్వయంగా కలిసే అవకాశం రావడంతో చాలామంది ఫాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కు జోడీ గా అలియా భట్ నటించగా ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌని రాయ్ నటిస్తున్నారు. వైజాగ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అలియా భట్ లు ఫాన్స్ కు తమ వీడియో మెసేజ్ లు పంపుతూ.. టీమ్ కు విషెస్ తెలిపారు.