కమల్ హాసన్ పై అగ్ర నిర్మాత ఫిర్యాదు!

Published : Sep 26, 2019, 12:15 PM IST
కమల్ హాసన్ పై అగ్ర నిర్మాత ఫిర్యాదు!

సారాంశం

లోకనాయకుడు కమల్‌ హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్‌ రాజా నిర్మాతల మండలి కంప్లయింట్‌ ఇచ్చారు.   

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దక్షిణాది భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ యూనివర్సల్ స్టార్ పై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

కమల్ హాసన్ తనకు ఎప్పటినుండో రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నారని.. చెల్లింపు విషయంలో ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఈ సందర్భంగా జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిలో పేర్కొన్నారు. కమల్ హాసన్ నటించిన 'ఉత్తమవిలన్' సినిమా 2015 రిలీజ్ సమయంలో జ్ఞానవేల్ రాజా నుండి కొంత డబ్బుని కమల్ తీసుకున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దీనికి బదులుగా స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న కమల్‌ ఇంతవరకు జ్ఞానవేల్‌ రాజాకు కాల్‌షీట్స్‌ ఇవ్వకపోవటంతో ఆయననిర్మాతల మండలిని ఆశ్రయించారు.

మరి దీనిపైనిర్మాతల మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.  ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. సినిమాల విషయంలో ఆయనకి కాస్త గ్యాప్ వచ్చింది!

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్