కె బాలచందర్ సతీమణి మృతి!

Published : Nov 26, 2018, 10:29 AM IST
కె బాలచందర్ సతీమణి మృతి!

సారాంశం

దివంగత దర్శకుడు కె బాలచందర్ భార్య రాజం(84) సోమవారం చెన్నైలో కన్నుమూశారు. కవితాలయా ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ మొదలుపెట్టి నిర్మాతగా రాజం బాలచందర్ కి క్రెడిట్ ఇచ్చేవారు.

దివంగత దర్శకుడు కె బాలచందర్ భార్య రాజం(84) సోమవారం చెన్నైలో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈరోజు తెల్లవారుజామున 4:30 నిమిషాల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 

బాలచందర్, రాజంలకి కొడుకు ప్రసన్న, కూతురు పుష్ప ఉన్నారు. కవితాలయా ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ మొదలుపెట్టి నిర్మాతగా రాజం బాలచందర్ కి క్రెడిట్ ఇచ్చేవారు. ఆమె నిర్మాతగా సింధు భైరవి, నాన్ మోహన్ అల్ల, ఎనక్కుల్ ఒరువన్ వంటి సినిమాలను నిర్మించారు.

ఆమె మరణవార్త తెలుసుకున్న ఇండస్ట్రీ సభ్యులు నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: జూ.ఎన్టీఆర్ పై చేతబడి చేశారా ? అందుకే ఆ కమెడియన్ ని దూరం పెట్టిన తారక్.. ఓపెన్ గా చెప్పేశాడు
వెంకటేష్ , బాలకృష్ణ ఒకే కథతో... ఒక ఏడాది, ఒకే రోజు, రిలీజ్ చేసిన రెండు సినిమాలు ఏవో తెలుసా?