అక్కడి ఫ్యాన్స్ కి ప్రభాస్ సర్ప్రైజ్!

Published : Apr 09, 2019, 04:54 PM IST
అక్కడి ఫ్యాన్స్ కి ప్రభాస్ సర్ప్రైజ్!

సారాంశం

'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. 

'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రభాస్ కి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు జపాన్ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

జపనీయులు బాహుబలి చిత్రాన్ని తమ సొంత చిత్రాలకంటే ఎక్కువగా ఆదరించారు. అందుకే ఇప్పుడు అక్కడి ప్రేక్షకుల కోసం ప్రభాస్ ఓ సర్ప్రైజ్ సిద్ధం చేశాడని సమాచారం. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట ప్రభాస్.

అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన జపాన్ వెళ్లనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నటిస్తోంది.

విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ కనిపించనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 28: అమూల్యను అర్థరాత్రి ఎత్తుకెళ్లి నిజస్వరూపం చూపించిన విశ్వక్
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి నడుము విరగ్గొట్టిన మీనా, మనోజ్ నోరు మూయించిన శ్రుతి