నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్, బింబిసార సీక్వెల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌..? వారియర్ గా తారక్..?

By Mahesh Jujjuri  |  First Published Oct 30, 2022, 9:40 AM IST

నదమూరిఅభిమానులకు గుడ్ న్యూస్.. తారక్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా కాలంతరువాత బింబిసార సినిమాతో హిట్ కొట్టాడు కల్యాణ్ రామ్. ఇక ఈమూవీకి సీక్వేల్ ను తమ్ముడు తారక్ తో చేయాలనకుంటున్నాడట కల్యాణ్ రామ్. 


ఈ మధ్య ప్రతీహిట్ సినిమాకు సీక్వెల్ మూవీ పక్కగా వస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సూపర్ హిట్ సాధించిన బింబిసార సినిమాకు సీక్వెల్ ప్లాన్నింగ్ లో ఉన్నారు టీమ్. పటాస్ తరువాత ఏ సినిమా కలిసి రాలేదు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు. ఇక చాలా కాలం తరువాత  ఆరేంజ్ లో హీరో కళ్యాణ్ రామ్ కు  బింబిసార సినిమాతో హిట్ పడింది. ఇక ఈమూవీ తమ్ముడు తారక్ కు అయితే బాగుంటుంది అని అనుకున్నాడట కల్యాణ్ రామ్.. అందుకే సీక్వెల్ ను ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌గా వచ్చిన  బింబిసార సినిమాతో  టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు కల్యాణ్ రామ్.  ఈ సినిమా ఇప్పుడు జీ 5  విడుదలై అక్కడ కూడా సత్తా చాటుతోంది.  కొత్త దర్శకుడైనా వశిష్ఠ ఈ మూవీతో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఇక ఈ మూవీ చూసిన నందమూరి ఫ్యాన్స్.. ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సీక్వెల్ ఎప్పుడు చేస్తున్నారంటూ అడుగుతున్నారు..? ఈ విషయంలో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు డైరెక్టర్ వశిష్ట అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. 

Latest Videos

 తొందరలోనే బింబిసార 2 వస్తుందని ప్రకటించాడు. అంతే కాదు అందరూ షాక్ అయ్యేలా మరో బిగ్ సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీలో తారక్ నటించబోతున్నాడంటూ హింట్ వదిలాడు. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు బింబిసార సీక్వెల్ ను లాక్ చేశాడు. 
 బింబిసార సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని.. ఊహించని విజయాన్ని అందించారని తెలిపాడు. ఇప్పుడు అందరూ సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పిన ఆయన.. బింబిసార సీక్వెల్‌ను ఫస్ట్‌ పార్ట్‌ ను మించేలా తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని చెప్పాడు. 

 ఎన్టీఆర్‌ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో కలిసి  కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో  బింబిసార సీక్వెల్‌ ను ప్లాన్ చేస్తున్నారట.  జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా నటింపజేయాలని  స్వయంగా కళ్యాణ్‌రామ్‌ ప్లాన్‌ చేశాడంట. అందుకే ఎన్టీఆర్‌ రేంజ్‌కు తగ్గట్టుగా ఆయన క్యారెక్టరైజేషన్‌ ఉండేలా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారట దర్శకుడు. అంతూ రాదే ఈమూవీలో తారక్ వారియర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. 

కళ్యాణ్‌రామ్‌ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక బింబిసార 2 మొదలవుతుందని చెప్పాడు. ప్రస్తుతం నవీన్‌ మేడారం దర్శకత్వంలో డేవిల్‌ సినిమాలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథలో బ్రిటిష్‌ గూఢచారిగా కళ్యాణ్‌రామ్‌ కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా పూర్తికాగానే బింబిసార రెండో పార్ట్‌ షూటింగ్‌ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరూ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. త్వరలో వస్తుందనే అనుకుంటున్నారు ఫ్యాన్స్.  

click me!